https://oktelugu.com/

జైలు నుండి వచ్చాక పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్ !

కన్నడ బ్యూటీ ‘సంజన గల్రాని’ అంటేనే.. ముందుగా డ్రగ్స్ వార్తలు గుర్తుకువస్తాయి. అంతగా అమ్మడు డ్రగ్ దందాలో నలిగిపోయింది. ఏకంగా జైలుకి కూడా పోయి కొన్నాళ్ళ పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించింది. మొత్తానికి ఎలాగోలా బెయిల్ సంపాదించి ప్రస్తుతం పెళ్లి చేసుకునే మూడ్ లో ఉంది అమ్మడు. లక్ డౌన్ లోనే ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంజనా, తాజాగా అతనితో ఏడు అడుగులు నడవడానికి రెడీ అవుతొంది. Also Read: స్టార్ హీరోయిన్ […]

Written By:
  • admin
  • , Updated On : March 7, 2021 / 05:44 PM IST
    Follow us on


    కన్నడ బ్యూటీ ‘సంజన గల్రాని’ అంటేనే.. ముందుగా డ్రగ్స్ వార్తలు గుర్తుకువస్తాయి. అంతగా అమ్మడు డ్రగ్ దందాలో నలిగిపోయింది. ఏకంగా జైలుకి కూడా పోయి కొన్నాళ్ళ పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించింది. మొత్తానికి ఎలాగోలా బెయిల్ సంపాదించి ప్రస్తుతం పెళ్లి చేసుకునే మూడ్ లో ఉంది అమ్మడు. లక్ డౌన్ లోనే ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంజనా, తాజాగా అతనితో ఏడు అడుగులు నడవడానికి రెడీ అవుతొంది.

    Also Read: స్టార్ హీరోయిన్ పెళ్లి.. అతనితోనే !

    కాకపోతే, ఈ పెళ్లి విషయం బయటికి రాకుండా సంజన చాల సీక్రెట్ ను మెయింటైన్ చేస్తోందట. మళ్ళీ తన వల్ల తనకు కాబోయే భర్తకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని ఫీల్ అవుతుందట. పైగా డ్రగ్స్ కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్లి వచ్చాక, ఆమె ఆలోచనలు కూడా పూర్తిగా మారిపోయాయట. గతంలో సాయంత్రం అయితే.. పార్టీ అంటూ పబ్ ల చుట్టూ తిరిగే సంజన.. ఈ మధ్య అసలు ఇంట్లో నుండి బయటకు రావడానికి కూడా ఇష్ట పడట్లేదట.

    Also Read: సుశాంత్ సింగ్ డ్రగ్స్ కేసు.. ఎన్‌సీబీ 30,000 పేజీల చార్జిషీట్..

    అలాగే పెళ్లి తర్వాత ఇక సినిమా రంగానికి కూడా పూర్తిగా దూరంగా ఉండాలని ఇప్పటికే ఫిక్స్ అయిందట. ఇంతకీ సంజన పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు డాక్టర్ పాషా. అతనితోనే ఆమె పెళ్లి. ఈ వేసవి సెలవుల్లో వీరి వివాహ వేడుక ఉంటుందని.. పెళ్లికి కేవలం కుటుంబ సభ్యులను మిత్రులను మాత్రమే ఆహ్వానించాలని ఈ జంట నిర్ణయించుకున్నారట. ఇక సంజన ఒకప్పుడు హైదరాబాద్, బెంగుళూర్, చెన్నై… ఇలా చక్కర్లు కొడుతూ.. సినిమాలతో పాటు ఇతర వ్యాపారాలు కూడా హ్యాపీగా చేసుకునేది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    మరి అవ్వన్నీ మానేసి.. సంజన ఏ స్థాయిలో తన ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తోందో చూడాలి. అయినా తనకు సినిమాలు ఉన్నా …లేకున్నా ఎప్పుడూ బిజీగా ఉండటం అలవాటు చేసుకుంది ఈ బ్యూటీ. మరి పెళ్లి తరువాత పూర్తిగా ఇంటిపట్టునే ఉండాలంటే.. కాస్త ఇబ్బందే.