‘రాశీ ఖన్నా’ పెద్దగా ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా అందంలో ఆమెకు తిరుగులేదు. పైగా యూత్ ను ఆకట్టుకోవడానికి కావాల్సినంత ఎక్స్ పోజింగ్ చేస్తోంది. కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది ఈ బబ్లీ బ్యూటీ. ఎప్పుడూ సెకండ్ గ్రేడ్ లోనే నిలిచిపోయింది. ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా అలాంటి పాత్రనే చేయబోతుంది.
అయితే, సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ రాశి ఖన్నా పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంది అట. సినిమాలో కమర్షియల్ సీన్స్ అన్నీ ఆమె చుట్టూనే తిరుగుతాయట. కాకపోతే ఈ సినిమాలో ఆమె పరిధి దాటి ఎక్స్ పోజింగ్ చేయాల్సి ఉంది. ఎలాగూ, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు సంపాదించడానికి ఎప్పటి నుంచో గ్లామర్ డోస్ ను రోజురోజుకూ పెంచుకుంటూ వచ్చింది రాశి ఖన్నా.
ఇప్పుడు ఏకంగా మహేష్ సినిమాలోనే ఛాన్స్ వచ్చింది కాబట్టి… ఇక ఆ సినిమా కోసం ఆమె ఏమైనా చేస్తోంది. అసలు ఆ మాటకొస్తే.. సోషల్ మీడియాలో ఈ మధ్య రాశీ ఖన్నా పోస్ట్ చేస్తోన్న ఫొటోలన్నీ ఎక్కువగా గ్లామరస్ గానే ఉంటున్నాయి. తనలోని ఒంపుసొంపుల ప్రదర్శనను పరి పూర్ణంగా ప్రదర్శిస్తూ దూసుకుపోతుంది. ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా అలాగే కనిపించబోతుంది.