https://oktelugu.com/

ఓ రేంజ్ కి వెళ్లలేకపోయినా.. ఛాన్స్ లు బాగానే పడుతుంది !

కొంతమంది హీరోయిన్లకి యాక్టింగ్ రాకపోయినా వారికి అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తుంటాయి. అలాంటి హీరోయిన్స్ లో రాశి ఖన్నా కూడా ఒకటి. అసలుకే బొద్దుగా అందాల బొమ్మలా ఉంటుందయ్యే. పైగా ఎక్స్ పోజింగ్ విషయంలో ఆడియన్స్ మొహమాటపడాల్సిందే తప్ప.. తనకు అలాంటి పట్టింపులు ఏమి ఉండవు. ఇక సెట్స్ లో డిమాండ్స్ కూడా చేయదట. ఎలాగూ తాను తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేయలేను కాబట్టి.. కేవలం తన అందచందాలతోనే ఆకట్టుకోవాలని.. అందుకే కాస్త మోడ్రన్ […]

Written By:
  • admin
  • , Updated On : November 12, 2020 / 07:23 PM IST
    Follow us on


    కొంతమంది హీరోయిన్లకి యాక్టింగ్ రాకపోయినా వారికి అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తుంటాయి. అలాంటి హీరోయిన్స్ లో రాశి ఖన్నా కూడా ఒకటి. అసలుకే బొద్దుగా అందాల బొమ్మలా ఉంటుందయ్యే. పైగా ఎక్స్ పోజింగ్ విషయంలో ఆడియన్స్ మొహమాటపడాల్సిందే తప్ప.. తనకు అలాంటి పట్టింపులు ఏమి ఉండవు. ఇక సెట్స్ లో డిమాండ్స్ కూడా చేయదట. ఎలాగూ తాను తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దుల్ని చేయలేను కాబట్టి.. కేవలం తన అందచందాలతోనే ఆకట్టుకోవాలని.. అందుకే కాస్త మోడ్రన్ గా కనిపించడానికి మక్కువ చూపిస్తానని చెబుతుంటుంది ఈ బబ్లీ బ్యూటీ.

    Also Read: శ్రీముఖిపై హాట్ కామెంట్స్ చేసిన హైపర్ ఆది.!

    కాగా తాజాగా రాశికి మరో ఆఫర్ దక్కింది. రవితేజ – రమేష్ వర్మ సినిమాలో హీరోయిన్ గా చాన్స్ వచ్చింది. రవితేజతో గతంలో బెంగాల్ టైగర్ అనే సినిమాలో ఆడిపాడింది. మళ్లీ ఇన్నాళ్లకు ఎట్టకేలకు రవితేజతో రొమాన్స్ చేయడానికి సన్నద్ధం అవుతోంది. ఎలాగూ రవితేజకు కూడా హీరోయిన్ల సమస్య ఉంది. అందుకే రాశి ఫోన్ చేసి.. ఛాన్స్ ఇవ్వండి అనగానే.. మాస్ మహా రాజా తెగ కయిగిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అలాగే చైతు విక్రమ్ కె కుమార్ సినిమాలోనూ రాశికి మరో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె పాత్ర కేవలం సెకెండ్ హాఫ్ లో మాత్రమే వస్తోందని.. అయినా యాక్ట్ చేయడానికి రాశి ఒప్పుకుందని.. కారణం, రాశితో చైతుకి రెండు సాంగ్స్ ఉన్నాయని అందుకే రాశి ఈ సినిమా పై బాగా ఆసక్తి చూపించిందట.

    Also Read: బిగ్ బాస్ లోకి మరో హీరో ఎంట్రీ.. టీఆర్పీ కోసం కష్టపడుతున్న నాగ్?

    అలాగే తమిళంలో ‘భూమి’ అనే సినిమాలో కూడా రాశికి హీరోయిన్ గా అవకాశం వచ్చింది. మొత్తానికి రాశి ఖన్నా లిస్ట్ లో ఇప్పుడు వరుస సినిమాలు ఉన్నాయి. నిజానికి లాక్ డౌన్ ముందువరకూ రాశి ఖన్నా పని అయిపోయింది, ఇక ఆమెకు అవకాశాలు రావడం కష్టమే అనుకున్నారు అందరూ. కానీ తనకు రావాల్సిన అవకాశాలు ఒక్కొక్కటి అలా అలా నెమ్మదిగా వేరే హీరోయిన్స్ దగ్గరకు వెళ్ళిపోతున్నాయని గమనించిన ఈ భారీ బ్యూటీ, ముందుగానే మేల్కొని దర్శకనిర్మాతలకు ఫోన్ చేసి ఛాన్స్ లు అడిగి మరీ మళ్లీ ఫామ్ లోకి వస్తోంది. ఏది ఏమైనా హీరోయిన్ గా ఓ రేంజ్ కి వెళ్లలేకపోయినా.. అవకాశాలను బాగానే అందుకుంటుంది రాశి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్