https://oktelugu.com/

Raashi Khanna: ‘మనీ హెయిస్ట్’​పై రాశీఖన్నా ఎగ్జైటింగ్​ పోస్ట్​

Raashi Khanna: ఇటీవల కాలంలో ఓటీటీల హవా జోరుగా పెరిగిపోయింది. కరోనాతో థియేటర్లు మూతపడిపోవడంతో ప్రేక్షకులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల దగ్గరకే వినోదం అంటూ ఓటీటీల్లోనే సినిమాలను విడుదల చేయడం ప్రారంభించారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే వెబ్​సిరీస్​ల జోరు బాగా పెరిగిపోయింది.  అలా ప్రేక్షకులను పలకపించిన పలు  వెబ్​సిరీస్​లు మంచి క్రేజ్​ దక్కించుకున్నాయి. వాటిల్లో ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మోస్ట్ అవైటెడ్​ సిరీస్​ మనీ హెయిస్ట్​. What a roller […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 5, 2021 / 11:25 AM IST
    Follow us on

    Raashi Khanna: ఇటీవల కాలంలో ఓటీటీల హవా జోరుగా పెరిగిపోయింది. కరోనాతో థియేటర్లు మూతపడిపోవడంతో ప్రేక్షకులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల దగ్గరకే వినోదం అంటూ ఓటీటీల్లోనే సినిమాలను విడుదల చేయడం ప్రారంభించారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలోనే వెబ్​సిరీస్​ల జోరు బాగా పెరిగిపోయింది.  అలా ప్రేక్షకులను పలకపించిన పలు  వెబ్​సిరీస్​లు మంచి క్రేజ్​ దక్కించుకున్నాయి. వాటిల్లో ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మోస్ట్ అవైటెడ్​ సిరీస్​ మనీ హెయిస్ట్​.

    నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అయిన ఆ సిరీస్​ నుంచి ఇప్పటి వరకు 5 సీజన్లు విడుదలయ్యాయి. తాజాగా, డిసెంబరు 3న సీజన్​5నుంచి వాల్యూమ్​ 2ను విడుదల చేశారు మేకర్స్​. దీంతో ఈ సిరీస్​ ముగియనుంది. ఇప్పటికే ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ సిరీస్​తో ఫుల్​ సందడి చేస్తున్నారు. అయితే, ఈ సిరీస్​పై పలువురు సినీ నటులు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వీరిలో గ్లామరస్​ స్టార్​ హీరోయిన్​ రాశీ ఖన్నా కూడా ఉన్నారు. తాజాగా, ఈ ఫైనల్​ చాప్టర్​పై రాశీ ఖన్నా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్​గా మారింది. తాను కూడా ఈ సిరీస్​ను చూసినట్లు తెలుస్తోంది.

    ఎంతో ఎమోషన్స్​తో కూడిన రోలర్​ కాస్టర్​లా మని హెయిస్ట్ ఫైనల్స్ ఉందంటూ.. ఎగ్జైట్​మెంట్​తో కూడిన రెస్పాన్స్​తో అందించింది. ప్రస్తుతం టాలీవుడ్​తో పాటు కోలీవుడ్​లోనూ పలు చిత్రాలు చేస్తోంది రాశీ ఖన్నా.