Akkineni Nageswara Rao: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది నటులు చాలా కష్టపడి, ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ తమ స్థాయిని విస్తరించుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. ఇక మరికొందరు మాత్రం వారసత్వంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా సక్సెస్ అవుతూ ఉంటారు. ఎవరు ఎలా వచ్చినా కూడా ఇక్కడ టాలెంట్ ఉంటేనే సూపర్ సక్సెస్ అవుతారు. లేకపోతే మాత్రం ఇక్కడ సక్సెస్ అవ్వడం చాలా కష్టం అనేది ఇప్పటివరకు మనం చాలామంది హీరోల విషయంలో చూశాం.
ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు ‘కమ్యూనిస్టు ‘ బావాజాలం తో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్న ఆర్ నారాయణమూర్తి ఒకరు. ఈయన కూడా సోలోగా ఇండస్ట్రీ కి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అప్పట్లో ఈయన చేసిన సినిమాలు ప్రేక్షకుల్లో విశేష ఆదరణను పొందాయి. ముఖ్యంగా నక్సలిజాన్ని బేస్ చేసుకొని ఈయన తీసిన ఎర్రసైన్యం, చీమలదండు లాంటి సినిమాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఇదిలా ఉంటే నారాయణమూర్తి చిన్నతనంలో సినిమాలు చూసేటప్పుడు ఆయనకి నాగేశ్వరరావు అంటే అమితమైన అభిమానం ఉండేదట, దాంతో నాగేశ్వర రావు స్టార్ హీరో మిగిలిన ఏ హీరో కూడా నాగేశ్వరరావును బీట్ చేయలేరు అనేంతలా నాగేశ్వరరావుని ఆరాధించేవాడట, ఇక అందులో భాగంగానే కొంతమంది ఎన్టీయార్ అభిమానులు నాగేశ్వరరావుని విమర్శిస్తే, ఈయన ఎన్టీఆర్ ని విమర్శిస్తూ చాలా మాటలు మాట్లాడే వారట. అయితే ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ సినిమాలను కూడా చూసిన ఆయన ఎన్టీఆర్ లో ఉన్న గొప్ప నటుడు ను చూసి చలించి పోయాడట.
ఇక అప్పుడు ఇంత గొప్ప నటుడుని మనం ద్వేషించడం కరెక్ట్ కాదు. నాగేశ్వరరావు గొప్ప నటుడే, అలాగే ఎన్టీయార్ కూడా గొప్ప నటుడే ఇద్దరు ఇండస్ట్రీకి రెండు కండ్ల లాంటివారు అని ఆయన అనుకొని ఎన్టీయార్ ను కూడా ఆరాధించడం మొదలు పెట్టాడట…ఇక ఈ విషయాన్ని తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. మొత్తానికైతే ప్రస్తుతం ఆర్ నారాయణ మూర్తి కొన్ని సినిమాలు చేసుకుంటూ బిజీగా తన కెరియర్ ని గడుపుతున్నాడు. ఇక ఈయన ఒకప్పుడు చేసిన సినిమాలు మాత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణను పొందాయి…