https://oktelugu.com/

Trisha: ఒక రాత్రికి 25 లక్షలు… ఆ ఎమ్మెల్యేతో గడిపిన త్రిష! కుదిపేస్తున్న వివాదం!

మన్సూర్ అలీ వ్యాఖ్యలను త్రిషతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు ఖండించారు. టాలీవుడ్ నుండి మన్సూర్ అలీ త్రిషను ఉద్దేశించి అన్న మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

Written By:
  • S Reddy
  • , Updated On : February 21, 2024 / 10:47 AM IST

    Trisha

    Follow us on

    Trisha: హీరోయిన్ త్రిష తనకు ప్రమేయం లేకుండానే వరుస వివాదాల్లో ఇరుక్కుంటుంది. ఇటీవల నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిషను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. విజయ్-లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కిన లియో చిత్రంలో త్రిష హీరోయిన్ గా చేసింది. మన్సూర్ అలీ ఖాన్ విలన్ రోల్ చేశాడు. త్రిష హీరోయిన్ అని చెప్పడంతో ఆమెతో రేప్ సీన్ ఉంటుంది. ఆమెను బెడ్ రూమ్ లోకి తీసుకెళతానని ఆశపడ్డాను. కానీ లియో సెట్స్ లో త్రిషను నాకు అసలు చూపించనేలేదు… అని మీడియా ఎదుట మాట్లాడారు.

    మన్సూర్ అలీ వ్యాఖ్యలను త్రిషతో పాటు పలువురు చిత్ర ప్రముఖులు ఖండించారు. టాలీవుడ్ నుండి మన్సూర్ అలీ త్రిషను ఉద్దేశించి అన్న మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఈ వివాదంలో రివర్స్ అయిన మన్సూర్ అలీ ఖాన్ చిరంజీవి మీద పరువు నష్టం దావా వేశాడు. కోర్టు మాత్రం అతనికే అక్షింతలు వేసింది. తాజాగా త్రిషను ఉద్దేశిస్తూ ఓ రాజకీయ నాయకుడు అత్యంత జుగుప్సాకరమైన కామెంట్స్ చేశాడు. త్రిష డబ్బుల కోసం ఒక ఎమ్మెల్యేతో రాత్రి గడిపిందని బహిరంగంగా మాట్లాడాడు.

    అన్నాడీఎమ్కే పార్టీ నుండి బహిష్కరించబడిన ఏవీ రాజు ఈ వ్యాఖ్యలు చేశాడు. గతంలో త్రిష గౌవత్తూరులో జరిగిన ఓ వేడుకకు హాజరైంది. అక్కడి ఎమ్మెల్యే ఆమె మీద మనసు పడ్డాడు. రూ. 25 లక్షలు తీసుకుని త్రిష ఆయనతో ఒక రాత్రి గడిపింది. అందుకు నేనే సాక్ష్యం అని కీలక కామెంట్స్ చేశాడు. ఏవీ రాజుపై చిత్ర ప్రముఖులు మండిపడుతున్నారు. ఏవీ రాజు ఆరోపణల మీద త్రిష స్పందించారు. కొందరు పాపులారిటీ కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. ఏవీ రాజుపై లీగల్ యాక్షన్ తీసుకుంటాను. ఇకపై ఈ వివాదం మీద నా లాయర్లు మాట్లాడతారు… అని త్రిష వెల్లడించారు.

    త్రిష పరిశ్రమకు వచ్చి 25 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ ఆమె స్టార్ హీరోయిన్ గా బడా ప్రాజెక్ట్స్ దక్కించుకుంటున్నారు. 17 ఏళ్ల అనంతరం చిరంజీవితో ఆమె జతకడుతున్నారు. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న విశ్వంభర చిత్రంలో త్రిష హీరోయిన్. ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో ఆమె పాల్గొంటున్నారు. కెరీర్ సక్సెస్ ఫుల్ గా సాగుతుండగా త్రిష అనుకోని వివాదాల్లో చిక్కుకుంటుంది.