HomeజాతీయంNational Family and Health Survey: భర్తలతో బలవంతపు శృంగారానికి నో చెబుతున్న భార్యలు

National Family and Health Survey: భర్తలతో బలవంతపు శృంగారానికి నో చెబుతున్న భార్యలు

National Family and Health Survey: కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మీ, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ అన్నట్టుగా.. పనిలో దాసిగా, సలహా ఇవ్వడంలో మంత్రిగా.. భోజనం పెట్టడంలో తల్లిగా.. అందంలో లక్ష్మిగా.. పడక గదిలో రంభగా.. క్షమించడంలో భూమాతగా ఆడది ఉండాలి స్త్రీల గురించి గొప్పగా చెప్పారు. ఇన్ని పనులను చేసే మహిళా మూర్తులకు ఈ సమాజంలో ఎంతో గౌరవం ఉంది. తల్లిగా మనకు జన్మనిచ్చిన దగ్గరి నుంచి పెంచి పెద్దచేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దవేరకూ మహిళల పాత్ర కాదనలేనది. అయితే అలాంటి మహిళలపై ఇప్పటికీ గృహ హింస దేశంలో జరుగుతూనే ఉంది. దేశంలో వివాహిత మహిళల్లో మూడవ వంతు (32 శాతం) మంది ఇప్పటికీ భర్తతో కలిసి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇక 44 శాతం మంది మహిళలు ఒంటరిగా మార్కెట్‌కు వెళ్లేందుకు కూడా మగవారు అనుమతించడం లేదని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (NFHS-5)లో తేలింది. దేశంలో మహిళా సాధికారత లక్ష్యానికి దూరంగా ఉందని తేలింది.

National Family and Health Survey
husband wife relationship

ఇక భారతదేశంలోని 82 శాతం మంది మహిళలు తమ భర్తలతో శృంగారంలో బలవంతంగా పాల్గొనడానికి నిరాకరిస్తున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. “ఐదుగురిలో నలుగురి కంటే ఎక్కువ మంది మహిళలు (82 శాతం) లైంగిక వాంఛకు ఇబ్బందిపెడుతుంటే తమ భర్తకు ధైర్యంగా నో చెప్పగలుగుతున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళాలోకంలో ఇప్పుడు అన్ని రంగాల్లో రాణిస్తూ స్వశక్తితో ఎదుగుతున్నారు. తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. మగవారిపై ఆధారపడకుండా జీవిస్తున్నారు. అందుకే ఈ భర్తల బలవంతపు శృంగారాన్ని కూడా ధైర్యంగా తిరస్కరిస్తున్నారు. దేశంలో ఎక్కువగా గోవాలో 92 శాతం మంది మహిళలు ఈ బలవంతపు శృంగారానికి నో చెప్పి ప్రథమస్థానంలో ఉన్నారు. ఇక అరుణాచల్ ప్రదేశ్ (63 శాతం), జమ్మూ & కాశ్మీర్ (65 శాతం) మంది మహిళలు నో చెబుతూ చివరి స్థానాల్లో ఉన్నారు” అని కుటుంబ ఆరోగ్య సర్వే తేల్చింది. నివేదికను కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య విడుదల చేశారు.17 జూన్ 2019 నుండి 30 జనవరి 2020 వరకు 17 రాష్ట్రాలు.. 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్వే తొలి దశ నిర్వహించారు. అనంతరం 2 జనవరి 2020 నుండి ఏప్రిల్ 30 వరకు రెండో దశ నిర్వహించారు. తాజాగా సర్వే ప్రవేశపెట్టారు.

Also Read: Ex Minister Narayana Arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు? పేపర్ లీక్ వ్యవహారమే కారణమా?

వైవాహిక అత్యాచారం అనేది భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద ‘రేప్’ యొక్క నిర్వచనానికి మినహాయింపుగా చట్టాలు చెబుతున్నాయి. 18 ఏళ్లు పైబడిన తన భార్యపై బలవంతంగా శృంగారం చేసిన వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయడం సాధ్యం కాదు. ఇలాంటి బలవంతపు అత్యాచారాలు దేశంలో బోలెడు జరుగుతున్నాయి. ఇన్నాళ్లు నోరుమూసుకున్న మహిళలు ఇప్పుడు గొంతెత్తుతున్నారు. తమకు ఇష్టం లేనిదే శృంగారానికి ఒప్పుకోవడం లేదు. మగవాళ్లకు ముఖం మీదనే కుండబద్దలు కొట్టినట్టు చెబుతున్నారు. ఏదేమైనా సమాజంలో భాగస్వాములిద్దరి వైఖరిలో క్రమంగా మార్పు వస్తుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నారు.

National Family and Health Survey
husband wife relationship

ఒక స్త్రీ తన భర్త కోరుకున్నప్పుడు అతనితో శృంగారంలో పాల్గొనడానికి నిరాకరించిన సందర్భంలో చాలా రకాల బుజ్జగింపులకు.. ఆమె కోరిన కోరికలపై హామీలు ఇస్తున్నట్టు తేలింది. కొందరేమో మందలిస్తున్నారు. ఇంకొందరు ఆమెకు డబ్బు లేదా ఇతర ఆర్థిక సహాయం చేయడానికి ఓకే చెబుతున్నారు. ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమెతో లైంగిక చర్యకు కొందరు పాల్పడుతున్నారు. ఇంకొందరు మరొక స్త్రీతో సెక్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు సర్వేలో తేలింది. స్త్రీ తన భర్తతో శృంగారంలో పాల్గొనడానికి నిరాకరిస్తే కోపం తెచ్చుకునే.. మందలించే హక్కు భర్తకు ఉందని 19 శాతం మంది పురుషులు అంగీకరిస్తున్నారని సర్వే పేర్కొంది. ఇక 72 శాతం మంది ఏం అనకుండా తమ మానాన తాము మిన్నకుండిపోతున్నారు. ఇలా శృంగార జీవితంలోనూ ఇన్నాళ్లు బానిసగా బతికిన మహిళా లోకం ఇప్పుడు తమ కాళ్లదగ్గరికే భర్తలను రప్పించుకుంటున్న స్థాయికి ఎదిగారని జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ మొత్తానికి నిగ్గుతేల్చింది. బలవంతపు శృంగారానికి చెక్ పడిందని తేలింది.

Also Read:AP Debt Burden: ఏపీ ప్రభుత్వ అప్పులపై క్లారిటీ.. కేంద్రం కన్నెర్ర

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version