PVR Inox: సినిమా టికెట్‌పై 70% డిస్కౌంట్‌.. మీకూ కావాలా?

టికెట్‌ చార్జీలను నిర్మాతలు, థియేటర్ల యజమానులు ఇష్టానుసారం పెంచుకుంటున్నారు. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్‌ అయినప్పుడు మొదటి పది రోజులు టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి తీసుకుని పది రోజుల్లోనే బడ్జెట్‌ రాబట్టుకుంటున్నారు.

Written By: Neelambaram, Updated On : February 19, 2024 10:26 am
Follow us on

PVR Inox: వినోదం పంచే మాధ్యమంలో అతిపెద్దది, కీలకమైనది.. సినిమా. సినిమా ద్వారా అందించే సమాచారం ప్రజల్లోకి తొందరగా వెళ్తుంది. ఇక సినిమా నటులను అభిమానులు అనుసరిస్తుంటారు. వారిని రోల్‌ మోడల్‌గా తీసుకుంటారు. దీంతో ఒకప్పుడు సినిమా థియేటర్లు వంద రోజులు సినీ అభిమానులతో కళకళలాడేవి. కానీ ఇప్పుడు సినిమా నచ్చితేనే చూస్తున్నారు. నెగెటివ్‌ టాక్‌ వస్తే థియేటర్లవైపు చూడడం లేదు. అయితే సినిమాలకు ప్రేక్షకులు రాకపోవడానికి టికెట్‌ చార్జీలు కూడా మరో కారణం.

ఇష్టానుసారంగా పెంపు..
టికెట్‌ చార్జీలను నిర్మాతలు, థియేటర్ల యజమానులు ఇష్టానుసారం పెంచుకుంటున్నారు. పెద్ద హీరోల సినిమాలు రిలీజ్‌ అయినప్పుడు మొదటి పది రోజులు టికెట్‌ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి తీసుకుని పది రోజుల్లోనే బడ్జెట్‌ రాబట్టుకుంటున్నారు. ఇందుకు ప్రభుత్వాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. పెరిగిన ధరలతో కామన్‌ పీపుల్స్‌ సినిమా థియేటర్లకూ దూరమవుతున్నారు.

ఓటీటీ యాప్స్‌ ఎఫెక్ట్‌..
ఇక ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడానికి మరో కారణం ఓటీటీ యాప్స్‌. దీని ప్రభావం థియేటర్లపై చాలా ఎక్కువగా ఉంది. రిలీజ్‌ అయిన సినిమా నెల రోజుల్లోనే ఓటీటీల్లోకి వస్తోంది. నిర్మాతలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లు.. సినిమాకు మంచి టాక్‌ ఉన్నప్పుడే ఓటీటీలకు రైట్స్‌ విక్రయిస్తున్నారు. దీంతో నెల రోజుల్లో ఓటీటీలోకి వస్తుంది కదా అని థియేటర్లకు వెళ్లడం లేదు.

థియేటర్లను రప్పించేందుకు..
అయితే థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు పీవీఆర్‌ సినిమా ఒక ప్లాన్‌ చేసింది. ఇందుకోసం పీవీఆర్‌ పాస్‌పోర్టును ప్రవేశపెట్టింది. రూ.699 పెట్టి ఈ పాస్‌పోర్టు కొనుగోలు చేస్తే సినిమా టికెట్‌ ధరపై 70 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. నెలకు పది సినిమాలు చూడవచ్చు.

షరతులు వర్తిస్తాయి..
అయితే పీవీఆర్‌ సినిమా ప్రకటించిన పీవీఆర్‌ పాస్‌పోర్టుకు కొన్ని కండీషన్స్‌ ఉన్నాయి. ఈ పాస్‌పోర్టు కేవలం పీవీఆర్‌ థియేటర్స్‌లో మాత్రమే పనిచేస్తుంది. ఇక రోజుకు ఒక సినిమాకు మాత్రమే ఈ పాస్‌పోర్టు డిౖస్కౌంట్‌ ద్వారా చేసే అవకాశం ఉంటుంది. ఇక ఈ పాస్‌పోర్టు కేవలం వారంలో ఐదు రోజులు అంటే శని, ఆదివారాల్లో చెల్లుబాటు కాదు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇక ఈ పాస్‌పోర్టును పీవీఆర్‌ వెబ్‌సైట్‌ లేదా, బాక్సాఫీస్‌లో కొనుగోలు చేయవచ్చు. నేరుగా థియేటర్లలోనూ విక్రయిస్తున్నారు.

సినీ ప్రియులారా.. ఇక ఆలస్యం చేయకండి. వెంటనే పీవీఆర్‌ పాస్‌పోర్టు కొనుగోలు చేసి మీకు నచ్చిన సినిమాను 70 శాతం డిస్కౌంట్‌పై వీక్షించండి.