https://oktelugu.com/

Akhanda 1st day Collections: బాలయ్య “అఖండ” సినిమా తొలిరోజు కలెక్షన్ ఎంతంటే…

Akhanda 1st day Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ మూవీ తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. డిసెంబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన ఈ మూవీపై ముందు నుంచే ప్రేక్షకులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి ఘన విజయం సాధించి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 3, 2021 / 11:54 AM IST
    Follow us on

    Akhanda 1st day Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ‘అఖండ’ మూవీ తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. డిసెంబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సింహా, లెజెండ్ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో వచ్చిన ఈ మూవీపై ముందు నుంచే ప్రేక్షకులు, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోసారి ఘన విజయం సాధించి హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్నారు వీరిద్దరు. ఇక తన మ్యూజిక్ తో తమన్ థియేటర్లలో మోత మొగిస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. మాస్ ఆడియన్స్ చేత గోలలు పెట్టిస్తూ క్లాస్ ఆడియన్స్ దృష్టిని లాగేసి ఈ సినిమా తొలిరోజే కలెక్షన్ల ఊచకోత మొదలు పెట్టేసింది.

    nandamuri balakrishna akhanda movie first day collections details

    తొలి షోతో సూపర్ డూపర్ హిట్ అనే మౌత్ టాక్ రావడంతో సాయంత్రానికల్లా థియేటర్ల వద్ద మాస్ జాతర షురూ అయింది. అన్ని ఏరియాల్లోని సినిమా హాల్స్ కిటకిటలాడాయి. దీంతో తొలిరోజు ఊహించినదానికి మించిన వసూళ్లు నమోదయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 23 కోట్ల గ్రాస్, 15.39 నెట్ వసూళ్లు వచ్చాయి.

    తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా కలెక్షన్ వివరాలు…
    నైజాం- 4.39 కోట్లు
    సీడెడ్- 4.02 కోట్లు
    ఉత్తరాంధ్ర- 1.36 కోట్లు
    ఈస్ట్ గోదావరి- 1.05 కోట్లు
    వెస్ట్ గోదావరి- 96 లక్షలు
    గుంటూరు- 1.87 కోట్లు
    కృష్ణా- 81 లక్షలు
    నెల్లూరు- 93 లక్షలు
    Also Read: బాలయ్య వసూళ్ల ప్రభంజనం… వకీల్ సాబ్ కి చెక్ పెట్టిన అఖండ!
    మొత్తంగా అఖండ 53 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 54 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగి తొలి షోతోనే కలెక్షన్ల ఊచకోత మొదలు పెట్టింది. మరో 35.26 కోట్లు రాబట్టిందంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసినట్లే. మొదటి రోజే ఈ రేంజ్ టాక్ రావడంతో ఈ శని, ఆది వారం ముగిసేసరికి ఈ సినిమా లాభాల బాటలోకి ఎంటర్ అవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

    Also Read: అప్పటి బాలయ్య-బి.గోపాల్​ కాంబో హిట్​ మళ్లీ బోయపాటితో తిరిగొచ్చిందా?