Pushpa: పుష్ప స్పెషల్​ సాంగ్​ షూట్​ ప్రారంభం.. సెట్స్​లో అడుగుపెట్టిన సామ్​

Pushpa: ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా దర్శకుడు సుకుమార్​ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ ఓ పల్లెటూరి మొరటోడి లుక్​లో కనిపించనున్నారు. సుకుమార్​ తొలిసారి పాన్​ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఇందులో రష్మిక హీరోయిన్​గా కనిపించనుంది. కాగా, ఇందులో సమంత ఓ స్పెషల్​ సాంగ్​లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని ఐటెం సాంగ్​పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కాగా, ఈ పాట […]

Written By: Raghava Rao Gara, Updated On : November 29, 2021 12:07 pm
Follow us on

Pushpa: ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా దర్శకుడు సుకుమార్​ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ ఓ పల్లెటూరి మొరటోడి లుక్​లో కనిపించనున్నారు. సుకుమార్​ తొలిసారి పాన్​ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఇందులో రష్మిక హీరోయిన్​గా కనిపించనుంది. కాగా, ఇందులో సమంత ఓ స్పెషల్​ సాంగ్​లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలోని ఐటెం సాంగ్​పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

కాగా, ఈ పాట షూటింగ్​కు సంబంధించి తాజా అప్​డేట్​ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్​సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందట. ఈ పాటకు గణేశ్​ ఆచార్య కొరియోగ్రఫీ చేస్తున్నారు. దీనికోసం రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఒక అదిరిపోయే ట్యూన్ కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పాట కోసం సామ్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇన్ని అంచనాల మధ్య ఈ పాట అభిమానులన్ని ఎలా అలరిస్తుందో చూడాలి.

రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా.. తొలి భాగాన్ని డిసెంబరు 17వ విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన పోస్టర్​లు, పాటలు సినిమాపై మంచి హైప్​ క్రియేట్​ చేశాయి. మరి అనుకున్న అంచనాలను చేరుకుంటుదో లేదో చూడాలి. మరోవైపు ఈ సినిమా ట్రైలర్​ను డిసెంబరు 6న విడుదల చేయనున్నట్లు ఈ రోజు ప్రకటించింది చిత్రబృందం. దీంతా ట్రైలర్​ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బన్నీ ఫ్యాన్స్​.