https://oktelugu.com/

Karthika Deepam: మోనితకు షాకింగ్ ట్విస్ట్.. స్టేజి మీదే మోనిత పరువు తీసిన వంటలక్క!

Karthika Deepam: బుల్లితెర ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ఎంతో ఉత్కంఠ భరితంగా మారింది.ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా దీప కార్తీక బస్తీలో క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఇదే సమయంలోనే మోనిత అక్కడికి వెళ్లి కార్తీక్ చేసిన అన్యాయం గురించి చెప్పడంతో దీప కోపంతో రగిలిపోతూ రివర్స్ అవుతుంది.ఆ సమయంలో బస్తీవాసులు అందరూ తనపై చీపుర్లు కర్రలు తీసుకొని దాడికి రావడంతో ప్రియమణి వెంటనే తనని […]

Written By: , Updated On : November 29, 2021 / 12:00 PM IST
Follow us on

Karthika Deepam: బుల్లితెర ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి ఎంతో ఉత్కంఠ భరితంగా మారింది.ఈ క్రమంలో నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా దీప కార్తీక బస్తీలో క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తున్నారు. ఇదే సమయంలోనే మోనిత అక్కడికి వెళ్లి కార్తీక్ చేసిన అన్యాయం గురించి చెప్పడంతో దీప కోపంతో రగిలిపోతూ రివర్స్ అవుతుంది.ఆ సమయంలో బస్తీవాసులు అందరూ తనపై చీపుర్లు కర్రలు తీసుకొని దాడికి రావడంతో ప్రియమణి వెంటనే తనని కార్లోకి తీసుకువెళుతుంది.

Karthika Deepam

Karthika Deepam

ఇలా బస్తీవాసులు తనపై వస్తున్నప్పటికీ మోనిత ఇంతగా అవమానిస్తారా? కార్తీక్ నీ భార్య స్వయంగా వచ్చి క్షమాపణ చేప్పెలా చేస్తా చూడు అంటూ చాలెంజ్ చేస్తుంది. ఇక దీప ఇంట్లో ఎవరు కనిపించకపోవడంతో పిల్లలు వచ్చి ఎక్కడికి వెళ్ళారని అడగడంతో వెంటనే ఆదిత్య బస్తీకి వెళ్ళారని చెబుతాడు.బస్తీక ఆ విషయం తెలిసి ఉంటే మేము వెళ్ళే వాళ్ళం అక్కడ ఉండడం ఎంతో బాగుంటుంది ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళమంటే వెళ్తామని అనడంతో పిల్లలపై ఆదిత్య ఇకపై ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకండి అంటూ వారిని పంపిస్తాడు.

Also Read: దీపను తప్పించే ప్లాన్ లో ఉన్న మోనిత.. చాటుగా తన ప్లాన్ ఏంటో తెలుసుకున్న ప్రియమణి!

ఇంటికి వెళ్లిన మోనిత భోజనం చేస్తూ చాలా బాగా కాపాడావు ప్రియమణి అంటూ ఉండగా మోనిత మాటలకు ప్రియమణి అయోమయంలో ఉండి అవమానం జరిగిన ఇలా హ్యాపీగా ఉన్నారు అని అడగడంతో ఎప్పటిలాగా కోతలు కోయడం కాదు ప్రియమణి రేపటి నుంచి కూతలు పెట్టిస్తాను చూడు అంటూ సంతోషంగా ఉంటుంది. మరోవైపు దీపా కార్తీక్ వంట చేసుకుంటూ సరదాగా గడపగా కార్తీక్ బస్తీలో ఇల్లు కట్టించుకుందామని మాట ఇస్తాడు.మరోవైపు హిమ కార్తీక్ దీప ఫోటోలు వేస్తూ ఉండగా సౌర్య వెళ్లి ఇకపై మనం బస్తీలో కొత్త ఇంటిలో ఉండబోతున్నామని చెప్పడంతో సంతోషపడుతుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా కార్తీక్ కి డాక్టర్ ప్రెసిడెంట్ పొజిషన్ ఇవ్వడానికి అంత ఏకగ్రీవం తెలుపుతారు. అదే సమయంలో భారతితో సహా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కార్తీక్ దీప గురించి మంచిగా చెబుతూ ఉంటారు. ఆ సమయంలో మోనిత అక్కడకు వెళ్లి నాకు అన్యాయం చేసిన కార్తీక్ కు ఈ పదవి న్యాయమైనది కాదు అంటూ మాట్లాడటంతో వెంటనే దీప స్టేజ్ మీదకు వెళ్లి తను డాక్టర్ వృత్తికే అర్హురాలు కాదు అంటూ తన పరువు మొత్తం తీస్తుంది.

Also Read: లోదుస్తులతో అరాచకం.. అవకాశాల కోసమేనా ఈ బరి తెగింపు !