
‘పుష్ప’. సినిమా బన్నీ – సుక్కు కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. “రంగస్థలం ” వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత సుకుమార్ రూపొందిస్తున్న సినిమా కావడం ఒకెత్తు అయితే .. ‘అల వైకుంఠపురంలో’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకె ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా మన నేటివిటీకి దగ్గరగా సహజత్వం ఉట్టిపడేలా పాత్రలు పండాలంటే లోకల్ గానే షూటింగ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యిందంట.
కాగా ఈ చిత్ర విశేషాలు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. ”.పుష్పలో 6 నిమిషాల ఓ యాక్షన్ సీన్ కోసం 6 కోట్లు ఖర్చు పెట్టబోతోన్నారు. అంతేకాకుండా భారత సినీ శ్రామికులకు ఉపాధి కల్పించేందుకు 100 శాతం ఇండియాలోనే షూట్ చేయబోతోన్నారు” అని తెలిపాడు . ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘పుష్ప’ సినిమాని తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి.