https://oktelugu.com/

Pushpa Pushpa Song: పుష్ప 2 సాంగ్ కాపీ చేసిన డిఎస్పీ…ఎక్కడి నుంచి లేపేశాడంటే..?

పుష్ప 2 సినిమాకి కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా పుష్ప సినిమా నుంచి 'పుష్ప పుష్ప' అనే ఒక టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు.

Written By:
  • Gopi
  • , Updated On : May 7, 2024 / 03:13 PM IST

    Pushpa Pushpa Lyrical Song is copy from that song

    Follow us on

    Pushpa Pushpa Song: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమా మీద జనాల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా భారీ ఎత్తున జరుపుకుంది. కాబట్టి ఈ సినిమా ఎలాగైనా సరే 1500 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆగస్టు 15వ తేదీన థియేటర్ లోకి వస్తుంది.

    ఇక అప్పటికి పెద్ద సినిమాలు ఏవి కూడా పోటీలో లేవు కాబట్టి పుష్ప 2 సినిమాకి కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా పుష్ప సినిమా నుంచి ‘పుష్ప పుష్ప’ అనే ఒక టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ సాంగ్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేశారు. ఇక దేవి ఈ సాంగ్ ను కాపీ చేసారంటు సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏ సాంగ్ నుంచి కాపీ చేశాడు అంటే పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో వచ్చిన ‘బీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ లో ముందుగా వచ్చే మ్యూజిక్ ని తీసుకొని దేవి ఈ సాంగ్ ని కంపోజ్ చేశారు అంటూ ఆ రెండు సాంగ్స్ ను కంపేర్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

    ఇక మొత్తానికైతే దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాతో మరోసారి బౌన్స్ బ్యాక్ అవుతారని అందరూ అనుకుంటున్నారు. కానీ మొదటి సాంగ్ కాపీ సాంగ్ అంటూ విమర్శలు ఎదుర్కోవడంతో దేవి కొంతవరకు నిరుత్సాహపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దేవితో పోలిస్తే తమన్ ఇంకా మరి దారుణం అనే చెప్పాలి. తమన్ నుంచి వచ్చిన ప్రతి పాట కూడా ఏదో ఒక సాంగ్ నుంచి కాపీ అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడు ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ని బ్లేమ్ చేస్తున్నారు…

    ఇక దేవి ఇచ్చిన మ్యూజిక్ ఎంత మంది కాపీ అని కామెంట్లు చేసుకున్నా కూడా ఈ సాంగ్ సూపర్ డూపర్ సక్సెస్ అయితే సాధించింది. ఇక ప్రతి ఒక్కరు ఈ సాంగ్ చాలా హైలెట్ గా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక దానికి తోడుగా చాలామంది ఈ సాంగ్ మీద రీల్స్, షాట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ భారీ వ్యూస్ ని దక్కించుకుంటున్నారు…