https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ లో కనిపించనున్న స్టార్ హీరోయిన్స్…

పుష్ప సినిమాలో సమంత తో స్పెషల్ సాంగ్ ని చేయించారు. ఆ సాంగ్ భారీగా సక్సెస్ అయి సినిమా సూపర్ హిట్ అవ్వడం లో చాలా వరకు హెల్ప్ చేసింది.

Written By:
  • Gopi
  • , Updated On : May 7, 2024 / 03:08 PM IST

    Meenakshi Chaudhary to do an item song in Pushpa 2

    Follow us on

    Pushpa 2: తెలుగు అనే కాకుండా పాన్ ఇండియాలో ప్రస్తుతం భారీ అంచనాలను రేకెత్తిస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది పుష్ప 2 అనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ అద్భుతమైన రెస్పాన్స్ ను అందుకుంటూ ముందుకు సాగుతుండగా ఈ సినిమా కోసం యావత్ ఇండియాలో ఉన్న అభిమానులందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని సుకుమార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించడమే కాకుండా భారీ వసూళ్లను రాబట్టే సినిమాగా కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు.

    ఇలాంటి క్రమంలోనే ఈయన చేస్తున్న ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించే దిశగా ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటాయి పుష్ప సినిమాలో సమంత తో స్పెషల్ సాంగ్ ని చేయించారు. ఆ సాంగ్ భారీగా సక్సెస్ అయి సినిమా సూపర్ హిట్ అవ్వడం లో చాలా వరకు హెల్ప్ చేసింది. ఇక ఇప్పుడు కూడా అలాగే భారీ ఎత్తున స్పెషల్ సాంగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన మీనాక్షి చౌదరి చేత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయించబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనక నిజమైనట్టయితే మీనాక్షి చౌదరి పంట పండినట్టే అని చెప్పాలి. ఎందుకంటే పాన్ ఇండియాలో పుష్ప 2 సినిమాకి ఉన్నక్రేజ్ అంతా ఇంతా కాదు.

    ఇక ఈ సినిమాతో సక్సెస్ కొట్టి తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రూవ్ చేసి మన ఇండస్ట్రీని మరొక మెట్టు పైకెక్కించాలనే ఉద్దేశ్యం లో ఇటు సుకుమార్, అటు అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును సైతం సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాతో మరోసారి అదే ఫీట్ ని రిపీట్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.