Sujeeth OG Update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తున్న హీరోలు చాలా మంది ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికి అడపదడప సినిమాలు చేస్తూ సూపర్ సక్సెస్ లను అందుకోవడానికి తీవ్రమైన ప్రయత్న చేస్తున్నాడు. ఇక ప్రభాస్ తో సాహూ సినిమా చేసి స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సుజిత్ సైతం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఓజి సినిమా కోసం దాదాపు 5 సంవత్సరాలుగా ఆ సినిమా మీదనే తన ఫోకస్ పెట్టి ముందుకు సాగుతున్నాడు. సెప్టెంబర్ 25 వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఇక దీని కోసమే సుజీత్ రాత్రి, పగలు కష్టపడుతున్నాడు. పవన్ కళ్యాణ్ సైతం ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతోంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా కోసం తను అహర్నిశలు విపరీతంగా కష్టపడుతున్నారట. ఇప్పటికే షూట్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన ఆయన ఈ సినిమాని అనుకున్న టైం కి తీసుకొచ్చి భారీ సక్సెస్ గా మలచాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read: బాలయ్య బాబు అఖండ 2 రిలీజ్ పై ఎందుకంత సస్పెన్స్.. ఏం జరిగింది..?
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న స్టార్ డైరెక్టర్లు అందరితో పోటీ పడాలంటే మాత్రం సుజిత్ భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరం అయితే ఉంది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయగలిగే కెపాసిటీ సుజిత్ కి ఉందని గతంలో పవన్ కళ్యాణ్ తెలియజేశాడు.
మరి ఇప్పుడు ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చి సూపర్ సక్సెస్ గా నిలుపుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇండియాలో ఇప్పటివరకు ఉన్న స్టార్ హీరోలందరిలో మన తెలుగు హీరోలే ముందు వరుసలో ఉన్నారు.
Also Read: మహేష్ బాబు – రాజమౌళి సినిమాలో ఆ ఒక్కటి మిస్ అవ్వబోతుందా..?
దర్శకుల విషయానికి వస్తే మన డైరెక్టర్లు స్టార్ డైరెక్టర్లుగా వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో సుజిత్ సైతం స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతాడా? తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…సుజీత్ ఈ సినిమాతో ఇపుడున్న స్టార్ డైరెక్టర్లందరికీ పోటీని ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…