Anasuya Bharadwaj Trolled: నోరు జారిన అనసూయ అడ్డంగా బుక్ అయ్యింది. ఆమెను తప్పు పడుతూ నెటిజెన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఇంతకీ అనసూయ చేసిన ఆ కామెంట్స్ ఏమిటో చూద్దాం..
అనసూయ భరద్వాజ్(ANASUYA BHARADWAJ) కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్. ఆమెకు ఎంత ఫేమ్ ఉందో అదే స్థాయిలో నెగిటివిటీ కూడా ఉంది. సాధారణంగా సెలెబ్స్ తమపై వచ్చే ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ కి స్పందించరు. మరీ మితిమీరితే తప్ప రెస్పాండ్ అవరు. అనసూయ మాత్రం ప్రతి నెగిటివ్ కామెంట్ కి కౌంటర్ ఇస్తుంది. తన డ్రెస్సింగ్, ఫ్యామిలీ మెంబర్స్ ని ట్రోల్ చేసినా, అసభ్య పదజాలంతో కామెంట్ పెట్టినా ఇచ్చి పడేస్తుంది.
Also Read: బీజేపీ గుట్టు బయటపెడుతోన్న రాజాసింగ్
అనసూయ ఎదుర్కున్న అతిపెద్ద వివాదాల్లో ఆమె డ్రెస్సింగ్ ఒకటి. బుల్లితెర షోలలో గ్లామర్ షో చేయడాన్ని పలువురు వ్యతిరేకించారు. సదరు విమర్శలకు అనసూయ లొంగింది లేదు. పైగా నా డ్రెస్ నా ఇష్టం. నాకు కంఫర్ట్ అనిపిస్తే చాలు, ఎలాంటి బట్టలైనా ధరిస్తా, జడ్జి చేయడానికి మీరెవరు అంటుంది. అలాగే హీరో విజయ్ దేవరకొండను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. రెండు మూడు సందర్భాల్లో విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ పరోక్షంగా సోషల్ మీడియా పోస్ట్స్ పెట్టింది అనసూయ.
దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెను ఆంటీ అని ట్రోల్ చేశారు. విజయ్ దేవరకొండ టీమ్ లోని ఓ వ్యక్తి నన్ను సోషల్ మీడియాలో టార్గెట్ చేశాడు. విజయ్ దేవరకొండ ప్రమేయం లేకుండా అది జరగదు. అందుకే నేను విజయ్ దేవరకొండను టార్గెట్ చేశాను. ఇకపై దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నానని అనసూయ ఓపెన్ గా చెప్పడం విశేషం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సోషల్ మీడియా నెగిటివిటీ పై మాట్లాడారు.
నేను దాదాపు 30 లక్షల మందిని బ్లాక్ చేసి ఉంటాను. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బ్లాక్ చేస్తాను. పలుమార్లు రియాక్ట్ అయ్యాక, విసిగిపోయి, ఇక నాకు నువ్వొద్దు, నా లైఫ్ లో నువ్వు లేవని బ్లాక్ చేసేశాను… అని అనసూయ అన్నారు. ఒక వ్యక్తి 30 లక్షల మందిని బ్లాక్ చేయడం అసాధ్యం. నువ్వు రోజుకు 100 మందిని బ్లాక్ చేసినా… ఏళ్ల తరబడి సమయం పడుతుందని, నెటిజెన్స్ లాజిక్స్ తీస్తున్నారు. అనసూయ నోరుజారి నెటిజెన్స్ కి దొరికిపోయింది. వారు ఆమెను ఆడేసుకుంటున్నారు.