Pushpa: సామ్​తో ‘పుష్ప’ ఐటెం సాంగ్​ షూటింగ్​ అప్పుడేనా?

Pushpa: ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా దర్శకుడు సుకుమార్​ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ ఓ పల్లెటూరి మొరటోడి లుక్​లో కనిపించనున్నారు. సుకుమార్​ తొలిసారి పాన్​ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఇందులో రష్మిక హీరోయిన్​గా కనిపించనుంది. అయితే, ఇటీవల ఈ సినిమాలోని ఐటెం సాంగ్​లో సమంత నటించనుందంటూ.. నెట్టింట వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని కన్ఫర్మ్​ చేస్తూ పుష్ప మేకర్స్​ కూడా అనౌన్స్ చేశారు. సమంత […]

Written By: Raghava Rao Gara, Updated On : November 21, 2021 10:57 am
Follow us on

Pushpa: ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​ హీరోగా దర్శకుడు సుకుమార్​ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్యంలో సాగే ఈ కథలో బన్నీ ఓ పల్లెటూరి మొరటోడి లుక్​లో కనిపించనున్నారు. సుకుమార్​ తొలిసారి పాన్​ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. ఇందులో రష్మిక హీరోయిన్​గా కనిపించనుంది. అయితే, ఇటీవల ఈ సినిమాలోని ఐటెం సాంగ్​లో సమంత నటించనుందంటూ.. నెట్టింట వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని కన్ఫర్మ్​ చేస్తూ పుష్ప మేకర్స్​ కూడా అనౌన్స్ చేశారు. సమంత పుష్పలో నటిస్తోందంటూ ఓ పోస్టర్​ను కూడా విడుదల చేశారు. దీంతో సినిమాలోని ఐటెం సాంగ్​పై మరింత ఆసక్తి పెరిగింది.

samantha

మరోవైపు ,ఈ పాట కోసం సమంత భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 1.5 కోట్లు సమంత తీసుకుంటున్నట్లు సమాచారం. సౌంత్​ ఇండియాలోనే ఈ రెమ్యునరేషన్​ రికార్డుగా తెలుస్తోంది. కాగా, ఈ పాట కోసం ప్రత్యేకంగా వేసిన సెట్​లో నవంబరు 28నుంచి షూటింగ్​ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు, ఈ పాట కోసం సామ్​ రిహార్సల్స్ కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పుష్ప ఐటెం సాంగ్​ కోసం ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా.. తొలి భాగాన్ని డిసెంబరు 17వ విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్​ సంగీతం అందిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన పోస్టర్​లు, పాటలు సినిమాపై మంచి హైప్​ క్రియేట్​ చేశాయి. మరి అనుకున్న అంచనాలను చేరుకుంటుదో లేదో చూడాలి.