Pushpa: సరికొత్త ట్రెండింగ్​ సృష్టిస్తోన్న ఊ అంటావా మావ.. పుష్ప పూనకాలే అంటున్న అభిమానులు

Pushpa: ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా వస్తోన్న సినిమా పుష్ప. క్రియేటివ్​ దర్శకుడు సుకుమార్​ తెరకెక్కించిన ఈ భారీ పాన్​  ఇండియా చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి ప్రకటించిన మొదటి నుంచి అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలోనే టీజర్​, పోస్టర్లు, పాటలు రిలీజ్​ చేసి.. అందుకు తగ్గ హైప్​ను పెంచారు మేకర్స్​. సాధారణంగా సుకుమార్​- అల్లు అర్జున్​ కాంబో అంటేనే ఏదో కొత్తదనం ఆశిస్తున్నారు ప్రేక్షకులు. […]

Written By: Raghava Rao Gara, Updated On : December 12, 2021 8:44 am
Follow us on

Pushpa: ఐకాన్​ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా వస్తోన్న సినిమా పుష్ప. క్రియేటివ్​ దర్శకుడు సుకుమార్​ తెరకెక్కించిన ఈ భారీ పాన్​  ఇండియా చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా గురించి ప్రకటించిన మొదటి నుంచి అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ క్రమంలోనే టీజర్​, పోస్టర్లు, పాటలు రిలీజ్​ చేసి.. అందుకు తగ్గ హైప్​ను పెంచారు మేకర్స్​.

సాధారణంగా సుకుమార్​- అల్లు అర్జున్​ కాంబో అంటేనే ఏదో కొత్తదనం ఆశిస్తున్నారు ప్రేక్షకులు. ఆర్య, ఆర్య2 సినిమాల్లో బన్నీని కొత్తగా చూపించడమే అందుకు కారణం. మరోవైపు రంగస్థలంతో ఫుల్​ఫామ్​లోకి వచ్చి సుకుమార్​.. ఈ సినిమాతో మరో భారీ హిట్​ అందుకోవాలని బలంగా అనుకంటున్నట్లు కనిపిస్తోంది.

ఇక సుకుమార్​- దేవి శ్రీ కాంబోలో వచ్చే సినిమాలో ఐటెం సాంగ్​ కూడా స్పెషల్​గానే ఉంటుంది. ఈ క్రమంలోనే పుష్పలోని ఐటెం సాంగ్​ను తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామ పేరుతో వచ్చిన ఈ సాంగ్​లో సమంత తన అందాలు ఆరబోస్తూ.. హాట్​ లుక్స్​తో కవ్వించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన ఈ పాట.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. విడుదలైన 24 గంటల్లోనే 14 మిలియన్​ వ్యూస్​కు చేరుకుని.. సౌత్​ ఇంియా మోస్ట్ వ్యూడ్​ సాంగ్​గా నిలిచింది. దేవి శ్రీ బీట్​కు ప్రేక్షకులు బాగా కనెక్ట్​ అయినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ట్రెండింగ్ 2లో దూసుకెళ్తోంది.