Ram Charan : #RRR చిత్రంతో గ్లోబల్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ ని అభిమానులు ప్రేమతో ‘గ్లోబల్ స్టార్’ అని పిలిచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇతర హీరోల అభిమానులు ఇండియా లో ఇంత మంది సూపర్ స్టార్స్ ఉండగా, కేవలం రామ్ చరణ్ ఒక్కడే గ్లోబల్ స్టార్ ఎలా అవుతాడు?, షారుఖ్ ఖాన్, రజినీకాంత్ కంటే పెద్ద హీరోనా వంటి కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, హాలీవుడ్ లో మన ఇండియన్ సినిమాకి మార్కెట్ తెచ్చిపెట్టిన #RRR చిత్రంలో రామ్ చరణ్ మెయిన్ హీరో. ‘టైటానిక్’ , ‘అవతార్’ లాంటి అద్భుతాలను తెరకెక్కించిన జేమ్స్ కెమరూన్ వంటి డైరెక్టర్ కూడా రామ్ చరణ్ నటన ని మెచ్చుకున్నాడు. దీనిని బట్టీ అర్థం చేసుకోవచ్చు, రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్ గా ఎలాంటి క్రేజ్ ఉంది అనేది. అంతే కాదు #RRR చిత్రం ఓటీటీ లోకి వచ్చిన కొత్తల్లో హాలీవుడ్ ఆడియన్స్ ప్రత్యేకించి రామ్ చరణ్ ని పొగడ్తలతో ముంచి ఎత్తారు.
ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ ‘గ్లోబల్ స్టార్’ అని అనడానికి మరో బలమైన కారణం ఉంది. ఆయన కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘రంగస్థలం’. సుకుమార్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా 2018 వ సంవత్సరంలో విడుదలై ప్రభంజనం సృష్టించింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని రామ్ చరణ్ అద్భుతమైన నటనని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ సినిమాని జపాన్ భాషలో డబ్ చేసి గత ఏడాది విడుదల చేసారు. ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం విడుదలైన సినిమాని డబ్ చేసి విడుదల చేస్తే ఫుల్ రన్ లో అక్షరాలా 30 మిలియన్ జపనీస్ డాలర్స్ ని రాబట్టింది. #RRR చిత్రానికి 43 మిలియన్ డాలర్లు రాగా, రంగస్థలం చిత్రానికి ఏకంగా 30 మిలియన్ డాలర్లను రాబట్టి రెండవ స్థానం లో నిల్చింది. ఇటీవల కాలం లో విడుదలైన సలార్, కేజీఎఫ్ సిరీస్ లకు కూడా జపాన్ లో ఈ స్థాయి వసూళ్లు రాలేదు.
దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు రామ్ చరణ్ కి గ్లోబల్ వైడ్ గా ఎలాంటి రీచ్ వచ్చింది అనేది. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కాబట్టే, రామ్ చరణ్ ని ఆయన అభిమానులు ‘గ్లోబల్ స్టార్’ అని పిలుచుకుంటారు, అందులో తప్పేంటి అని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట. ఇదంతా పక్కన పెడితే సంక్రాంతికి రామ్ చరణ్ నుండి ‘గేమ్ చేంజర్’ చిత్రం విడుదల అవ్వబోతుంది. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం విడుదలై సూపర్ హిట్ అయితే వచ్చే ఏడాది చైనీస్, జపనీస్ భాషల్లో విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడట. ఇక నుండి రామ్ చరణ్ నుండి విడుదలయ్యే ప్రతీ సినిమా గ్లోబల్ వైడ్ గా ఉండబోతుందని సమాచారం.