Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం డిసెంబర్ 5న విడుదల అవ్వబోతున్న ఈ సందర్భంలో, ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పుష్ప 2’ మేనియానే కనిపిస్తుంది. రీసెంట్ గానే మూవీ టీం ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, సినిమా డిసెంబర్ 6వ తేదీ నుండి డిసెంబర్ 5వ తేదికి వాయిదా ప్రీ పోన్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇంతకు ముందు పెద్ద హీరోల సినిమాలు శుక్రవారం రోజున విడుదల అయ్యేవి. కానీ ఇప్పుడు మాత్రం లాంగ్ వీకెండ్ ట్రెండ్ మొదలైంది. గురువారం రోజున విడుదల చేస్తే మొదటి రోజు ఓపెనింగ్ వసూళ్లతో పాటు అదే రేంజ్ ఫ్లో ఆ తర్వాతి మూడు రోజులు కొనసాగి భారీ వసూళ్లు వస్తాయనే స్ట్రాటజీ తో వెళ్తున్నారు మేకర్స్. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వడంతో ‘పుష్ప 2 ‘ చిత్రాన్ని ప్రీపోన్ చేసారు.
కానీ ఈ సినిమాకి ముందు రోజు నుండే ప్రీమియర్ షోస్, మిడ్ నైట్ షోస్ ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపించే విషయంలో మూవీ టీంకి పెద్ద చిక్కు వచ్చి పడింది. హైదరాబాద్ లో సెక్షన్ 144 అమలులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. నవంబర్ 28వ తారీఖు వరకు ఈ సెక్షన్ ఉంటుంది. నగరంలో రాబోయే రోజుల్లో అల్లర్లు, అసాంఘిక కార్యక్రమాలు, ధర్నాలు, రాస్తారోకోలు జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు, ఈ నిర్ణయం తీసుకున్నారు. రూల్స్ ప్రకారం గుంపులుగా మనుషులు ఒకే చోట ఉండడం, సభలు నిర్వహించడం వంటివి నిషేధం కనుక, పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో రద్దు చేశారట మేకర్స్. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మేకర్స్ ఇప్పుడు అమరావతిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఈమేరకు మేకర్స్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని సభ నిర్వహించుకునేందుకు అధికారిక యంత్రాంగాన్ని అనుమతించేలా చేయమని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారట. ఈ సందర్భంగా కృతజ్ఞతతో అల్లు అర్జున్ అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకంగా కలిసి, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరబోతున్నాడట.
ఇది ఇప్పుడు మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానులు నంద్యాల ఘటన జరిగినప్పటి నుండి ఫ్యాన్ వార్స్ చేసుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని, ఒకప్పటి లాగా వీళ్లిద్దరు ఇప్పుడు లేరని, ఇలా పలు రకాల ఊహాగానాలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతూ ఉండేవి. వీటి అన్నిటికి చెక్ పెట్టాలని అల్లు అర్జున్ నిర్ణయం తీసుకున్నాడట, అందుకే పవన్ కళ్యాణ్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలవబోతున్నట్టు తెలుస్తుంది.