Pushpa 2 The Rule: పుష్ప 2 ఫీవర్ ఇండియాను ఊపేస్తోంది. మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రానుంది. అభిమానులు ఒక్కో నిమిషం లెక్కబెట్టుకుంటున్నారు. పుష్ప 2 డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ 12000 పైగా థియేటర్స్ లో 6 భాషల్లో విడుదలవుతుంది. 4వ తేదీ అర్ధరాత్రి నుండి పుష్ప 2 ప్రదర్శనలు ఉంటాయి. పుష్ప 2 ఇండియాలోనే అతిపెద్ద రిలీజ్ అని చెప్పొచ్చు. కాగా హైదరాబాద్ వేదికగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. దీనికి భారీ రెస్పాన్స్ దక్కింది. రాజమౌళితో పాటు పలువురు చిత్ర ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు.
అంతకు ముందు పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ముంబై, చెన్నై, కొచ్చిన్ నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిగాయి. ఆకాశమే హద్దుగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఉన్నాయి. కాగా నేడు పుష్ప 2 మేకింగ్ వీడియో విడుదల చేశారు. రెండు నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో మైండ్ బ్లాక్ చేసింది. ఈ చిత్రం కోసం సుకుమార్, అల్లు అర్జున్ తో పాటు చిత్ర యూనిట్ పడిన కష్టం కనబడుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. భారీ సెట్స్ నిర్మించారు.
దాదాపు రూ 500 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కించారని సమాచారం . మేకింగ్ వీడియోలో మనకు పెట్టిన ప్రతి రూపాయి కనిపిస్తుంది. ఖర్చుకు వెనకాడకుండా నిర్మాతలు పుష్ప 2 చిత్రాన్ని రూపొందించారు. యాక్షన్ ఎపిసోడ్స్ పుష్ప 2 లో ఊహకు మించి ఉంటాయనిపిస్తుంది. మొత్తంగా పుష్ప 2 మేకింగ్ వీడియో అద్బుతంగా ఉంది. అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లింది.
2021లో వచ్చిన పుష్ప చిత్రానికి ఇది సీక్వెల్ కాగా .. ఏకంగా మూడేళ్లు సమయం పట్టింది. బెటర్ అవుట్ ఫుట్ కోసం సుకుమార్ సమయం తీసుకున్నారు. ఆగస్టులో విడుదల కావాల్సిన పుష్ప 2 డిసెంబర్ కి వాయిదా పడింది. ఓ వారం రోజుల క్రితం వరకు కూడా షూటింగ్ చేయడం విశేషం. ఈ సినిమాను చెప్పిన సమయానికి తెచ్చేందుకు సుకుమార్ టీమ్ చాలా కష్టపడ్డారు.
రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసింది. ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు, అనసూయ, సునీల్, రావు రమేష్ కీలక రోల్స్ చేస్తున్నారు. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు.