Good News For The Unemployed: కాలం మారుతున్న కొద్దీ విద్యా వ్యవస్థలు మారుతున్నాయి. ఒకప్పుడు చదువుకునేవారి సంఖ్య తక్కువగా ఉండేది. కానీ విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడంతో పాటు చాలా మంది చదువుపై అవగాహన కల్పిస్తుండడంతో తమ పిల్లలను బడిలో చేర్పిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరూ విద్యావంతులుగా మారుతున్నారు. అయితే చదువుకున్న వారికి సరైన ఉద్యోగాలు లేక ఏదో ఒక పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో నిరుద్యోగం పెరిగిపోతుంది మరోవైపు కొన్ని కంపెనీలో నైపుణ్యం ఉన్న యువత కోసం ఎదురుచూస్తోంది. ఉద్యోగం చేయాలనుకునే వారికి, కంపెనీల అవసరాలకు మధ్య దూరం ఎక్కువగా ఉంది. ఈ దూరాన్ని తగ్గించడానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త సౌకర్యాన్ని అందుబాటులకి తీసుకొచ్చింది. అదే Digital Employment Exchange of Telangana (DEET). నిరుద్యోగులు, కంపెనీలు ఒకే వేదికపైకి రావడానికి డీట్ ఉపయోగపడనుంది. అదెలాగంటే?
తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి డీట్ ను డిసెంబర్ 4న ప్రారంభించనున్నారు. ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీలు, నిరుద్యోగులు ఈ డిజిటల్ వేదికపై ఉండనున్నారు. నిరుద్యోగులు తమ ప్రొఫైల్ ను ఇందులో ఉంచడం ద్వారా కంపెనీలు తమకు అవసరైన మానవ వనరులను ఇందులో నుంచి తీసుకుంటారు. డిగ్రీ ఫైనల్ హియర్ చదువుతున్న విద్యార్థులు ఇందులో తమ వివరాలను నమోద చేసుకోవాలి. వారి క్వాలిఫికేషన్, చదువును బట్టి ఉద్యోగాలు వస్తుంటాయి. అలాగే వ్యాపారం చేయాలని అనుకునేవారికి సైతం వివిధ అవకాశాలు ఇందులో ఉంటాయి. ఏవైనా కంపెనీలకు వ్యక్తుల ప్రొఫైల్ నచ్చితే నేరుగా కాల్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తాయి.
నిరుద్యోగులు డీట్ లో తమ వివరాలను నమోదు చేసుకోవాలంటే ముందుగా దీని యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. దీనిని www.tsdeet.com అనే వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆధార్, పాన్ కార్డుతో పాటు స్టడీకి సంబంధించిన వివరాలు అందించాల్సి ఉంటుంది. అయితే ఇందులో వ్యక్తుల స్కిల్స్ ఆధారం చేసుకొని ఆయా రంగాల్లోని కంపెనీలు అవకాశాలు కల్పిస్తాయి. ఎక్కువగా AI ఆధారిత జాబ్స్ ఇంజిన్ తో పనిచేస్తుంది. కొందరు నిరుద్యోగులు కంపెనీలు పిలిచే వరకు వెయిట్ చేయకుండా ఉండాలని అనుకునేవారు.. అందుబాటులో ఉన్న ఉద్యోగాలను సెలెక్ట్ చేసుకోవచ్చు. దీంతో ఆయా కంపెనీలు కాల్ చేసి నిరుద్యోగులను రప్పించుకుంటాయి.
అయితే ప్రాథమికంగా ఈ యాప్ లో ఉన్న మెసేంజర్ ద్వారా చాట్ చేస్తారు. అభ్యర్థికి సంబంధించిన వివరాలు తెలుసుకుంటారు. తమ కంపెనీకి అర్హత సాధించారని తెలిస్తే నేరుగా ఇంటర్వ్యూ చేస్తారు. ఆ తరువాత అభ్యర్థులకు కంపెనీ నచ్చకపోతే ఇతర కంపెనీలను ఎంచుకోవచ్చు. కంపెనీలు సైతం పలువురు అభ్యర్థులను ప్రాథమికంగా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసుకుంటారు. ఇందులో ఇంటర్వ్యూలకు సంబంధించిన వివరాలతో పాటు ఎంప్లాయర్ షెడ్యూల్ చేసిన ఇంటర్వ్యూ వివరాలు, లోకేషన్స్ బేస్డ్ జాబ్స్ గురించి కూడా తెలుసుకోవచ్చు. కొందరు స్థానికంగా ఉద్యోగాలు కావాలని అనుకునేవారికి ఈ యాప్ సహకరిస్తుంది. కొన్నేళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి, అందులోనూ ప్రైవేట్ జాబ్ చేయాలని ఉత్సాహం ఉన్న వారికి డీట్ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.