Thandel Movie: అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘తండేల్’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు కూడా అదిరిపోయాయి. అనకాపల్లి నుండి అమెరికా వరకు నాగ చైతన్య కెరీర్ లోనే ది బెస్ట్ ఓపెనింగ్ ఈ సినిమాకి రాబోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాసేపటి క్రితమే ఈ మూవీ టీం మీడియా ముందుకు వచ్చి ఎంత సంతోషంతో సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారో మనమంతా చూసాము. నిర్మాత అల్లు అరవింద్ అయితే పట్టరాని ఆనందంలో ఉన్నాడు. నాగ చైతన్య ముఖంలో చాలా కాలం తర్వాత నిజమైన సంతోషం కనిపించింది. బుక్ మై షో లో ప్రస్తుతం ఈ సినిమాకి గంటకు 16 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ట్రెండ్ చూస్తుంటే వీకెండ్ కి బ్రేక్ ఈవెన్ కొట్టేలా ఉంది.
అభిమానులంతా ఇంతలా సంతోషిస్తున్న సమయంలో ఇప్పుడు ఈ చిత్రం కొత్త వివాదాల్లో చిక్కుకుంది. తండేల్ మూవీ ని మేకర్స్ మా మనోభావాలు దెబ్బతినేలా తీశారంటూ శ్రీకాకుళం మెకనైజ్డ్ బోట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానకి రామ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ ‘తండేల్ మూవీ స్టోరీ పూర్తిగా అవాస్తవం. పాకిస్థాన్ లో చిక్కుకున్న 22 మంది జాలరులను అప్పటి ముఖ్య మంత్రి జగన్ గారు ఎంతో కష్టపడి విడిపించారు. ఈ స్టోరీ ని సినిమాలో చూపించకుండా, ప్రేమకథని చూపిస్తారా?, ఇదెక్కడి న్యాయం?, ఈ కథ మాజీ సీఎం జగన్ గారిది. ఆయనే నిజమైన తండేల్. వాస్తవాలను కప్పేసి తీసిన ఈ చిత్రాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. రోజురోజుకి సోషల్ మీడియా లో ఈ వివాదం ముదురుతోంది. వైసీపీ అభిమానులు ఈ విషయం లో అసలు తగ్గడం లేదు.
ప్రతీ రోజు గీత ఆర్ట్స్ ని, బన్నీ వాసు ని సోషల్ మీడియా లో ట్యాగ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఇదే విషయాన్నీ అల్లు అరవింద్ దృష్టికి తీసుకెళ్తే, ఈ విషయం మాకు మొన్ననే తెలిసింది, ఇప్పుడు సినిమా షూటింగ్ అయిపోయింది, ఏమి చేయలేము కానీ, త్వరలోనే శ్రీకాకుళం వెళ్లి ఆ జాలరుల మధ్య సక్సెస్ మీట్ ని పెద్దగా చేసేలా ప్లాన్ చేస్తున్నాము అని చెప్పుకొచ్చాడు. అయితే అల్లు అరవింద్ నోట మాజీ సీఎం జగన్ పేరు వచ్చే దాకా వైసీపీ అభిమానులు ఊరుకునేలా లేరు. ప్రస్తుతం అల్లు ఫ్యామిలీ తమ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసుకుంటూ పోతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే జగన్ ని కలిసి కృతఙ్ఞతలు తెలియచేసే కార్యక్రమాలు ఏమైనా పెట్టుకున్నారా అనే అనుమానాలు అభిమానుల్లో తలెత్తాయి. అదే కనుక జరిగితే సోషల్ మీడియా లో అగ్నిపర్వతం బద్దలు అయ్యినట్టే.