Pushpa:అల్లు అర్జున్ ‘పుష్ప 2 ’కోసం ఈగర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ షెడ్యూల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా..? అని అనుకుంటున్నారు. ఈ క్రమంలో చిత్రం యూనిట్ నుంచి అడపా దడపా సమాచారం వస్తుందే గానీ.. రెగ్యులర్ షూటింగ్ పై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశతోనే ఉన్నారు. ఈ క్రమంలో తాజా అప్డేట్ తో మళ్లీ వారిలో జోష్ వచ్చినట్లయింది. లేటెస్టుగా పుష్ప 2 షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. అందరూ అనుకున్న విధంగా ఈ షూటింగ్ ను అక్కడో.. ఇక్కడో కాదు.. హైదరాబాద్ లోనూ మొదలెట్టారు. అంతేకాకుండా దీనిని ఓ ప్రత్యేకమైన ప్లేసులో స్టాట్ చేశారు. ఆ విశేషాలు మీకోసం..

‘పుష్ప 1’ రిలీజై ఏడాది కావస్తోంది. ఇప్పటికీ పార్ట్ 2 షూటింగ్ ప్రారంభం కాలేదు. దీంతో సినిమా ఎప్పుడు థియేటర్లోకి వస్తుందోనని రకరకాల చర్చలు సాగుతున్నాయి. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఇది తెలుగులోనే కాకుండా నార్త్ తో పాటు అమెరికాలో మంచి వసూళ్లను రాబట్టింది. దీంతో అక్కడి ప్రేక్షకులు పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే పుష్ప 1 పై వచ్చిన హైప్ తో పార్ట్ 2 మరింత క్రేజీగా తీసేందుకు యూనిట్ చాలా టైం తీసుకుంటున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే మంచి లోకేషన్స్ కోసం నార్త్ లోకి వెళ్లి పరిశీలించింది. బ్యాంకాక్ కూడా సినీ ముఖ్యులు వెళ్లి పరిశీలించారట. దీంతో పుష్ప 2ను అక్కడే ప్రారంభిస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
పుష్ప 2 హైదరాబాద్ లో ప్రారంభించారు. అక్కడా.. ఇక్కడా.. కాకుండా రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేక సెట్ వేశారు. అంతేకాకుండా ఇక్కడో ప్రత్యేకత ఉంది. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా షూటింగ్ ప్రదేశంలోనే పుష్ప 2ను కూడా తీస్తున్నారట. దీంతో బాహుబలి లాగే పుష్ప 2 కూడా రికార్డులు తిరగేస్తుందని అంటున్నారు. పుష్ప 1 కు ఆల్ ఇండియా వైడ్ గా పేరొచ్చింది. దీంతో బన్నీ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఇప్పుడు ఆ లెవల్లో సినిమా తీయాలి. అందుకే బాహుబలి తీసిన ప్రదేశంలోనే దీనిని తీస్తున్నట్లు ప్రకటించడంతో ఇప్పటికే బిజినెస్ ప్రారంభమైందని అంటున్నారు.
తాజాగా స్ట్రాట్ చేసిన షూటింగ్ లో అల్లు అర్జున్ లేడు. మిగతా సీన్స్ తీశారు. డిసెంబర్ నుంచి బన్నీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ఇక ఆగేదేలే.. అన్న రేంజ్ తో ముందుకెళ్తుంది. పుష్ప పార్ట్ 1 లో బన్నీ కూలీగా.. ఆ తరువాత వ్యాపార వేత్త స్థాయికి ఎదుగుతారు. ఇప్పుడు పార్ట్ 2లో అడవిని ఏలే లీడర్ గా కొనసాగుతారని చర్చించుకుంటున్నారు. అటు పుష్ప ఫ్రెండ్ విలన్ అవుతాడని అంటున్నారు. కానీ సినిమా చూసే దాకా స్టోరీ సస్పెన్షన్ గానే ఉండొచ్చని బన్నీ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఏదీ ఏమైనా పుష్ప 2 ఇక పరుగులు పెట్టనుంది..