Arjun Kalyan- Geetu Royal: బిగ్ బాస్ సీజన్ 6 ప్రస్తుతం కాకా మీద కొనసాగుతుంది..పడవ వారం లోకి అడుగుపెట్టడం తో బిగ్ బాస్ టాస్కులన్నిటిని కఠినతరం చేసాడు..మొదట్లో నత్తనడకన సాగిన ఈ రియాలిటీ షో ఇప్పుడు అదిరిపొయ్యే టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది..కంటెస్టెంట్స్ అందరూ కూడా కసితో చిరుతపులులు లాగ తలపడి ఆడడమే అందుకు కారణంగా చెప్పవచ్చు..అయితే గత కొద్ది వారల నుండి ఊహించని ఎలిమినేషన్స్ జరగడం ఈ షో పై ప్రేక్షకుల్లో నెగటివిటీ ని పెంచుతుంది.

బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ అందరిని సెలెక్ట్ చేసుకొని బిగ్ బాస్ బయటకి పంపిస్తున్నారు,షోకి కావాల్సినంత కంటెంట్ ని ఇచ్చే గీతూ లాంటి కంటెస్టెంట్ ని ఎలిమినేట్ ఏమిటి..బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తం తొండి ఆటలాగానే అనిపిస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేసారు..అయితే ఈ నెగటివిటీ ని బాగా గమనించిన బిగ్ బాస్ టీం ఎలిమినేట్ అయినా ఇంటి సభ్యులలలో ఇద్దరికీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ని కల్పిస్తున్నట్టు సమాచారం.
బిగ్ బాస్ సీజన్ 2 లో చేసినట్టుగానే ఎలిమినేటైనా నలుగురు ఇంటి సభ్యులను ఆడియన్స్ పోల్ లో పెట్టి ఎక్కువ ఓట్లు దక్కించుకున్న టాప్ 2 కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపబోతున్నట్టు సమాచారం..అర్జున్ కళ్యాణ్, సూర్య , గీతూ మరియు ఆరోహి ని బిగ్ బాస్ టీం పోలింగ్ లో పెట్టడానికి ఎంచుకున్నట్టు టాక్..వీరిలో అర్జున్ కళ్యాణ్ మరియు గీతూ కి అత్యధిక ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు చెప్తున్నారు..సోషల్ మీడియా వోటింగ్ ప్రకారం అర్జున్ కళ్యాణ్ అసలు ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కాదని.

అతనికి టాప్ 3 రేంజ్ వోటింగ్స్ వచ్చాయని ఆయన అభిమానులు మొదటి నుండి వాదిస్తూనే ఉన్నారు..ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ కి కూడా వర్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇంట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది అనే వార్తలు రావడం ఆయన ఫాన్స్ కి కిక్ ని ఇస్తుంది..మరోపక్క గీతూ ఎలిమినేషన్ అవ్వడాన్ని ఇంటి సభ్యులతో పాటుగా ఆడియన్స్ కూడా ఎంతలా ఫీల్ అయ్యారో మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఆమె కూడా రీ ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు రావడం తో ఆమె ఫాన్స్ సంతోషిస్తున్నారు.