https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ సరికొత్త వెబ్ సిరీస్..ఫ్యాన్స్ కి ఇక ప్రతిరోజు పండగే!

అల్లు అర్జున్ తో ఒక టాక్ షో ని ఏర్పాటు చేయబోతున్నారా?, లేదా ఏదైనా వెబ్ సిరీస్ ని ప్లాన్ చేయబోతున్నారా?

Written By:
  • Vicky
  • , Updated On : June 10, 2023 / 07:39 PM IST
    Follow us on

    Allu Arjun: అభిమానులను ఎత్తిన కాలర్ ని దించకుండా చెయ్యడం లో దిట్ట స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.తన నుండి అభిమానులు ఏవైతే కోరుకుంటారో, వాటికి మించి ఇవ్వడం అల్లు అర్జున్ కి బాగా అలవాటు. అందుకే ఆయన టాలీవుడ్ నుండి పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు ఆయన హీరో గా నటిస్తున్న పుష్ప సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఇది అల్లు అర్జున్ సాధించిన విజయం అని గర్వంగా చెప్పుకోవచ్చు.

    ఇన్ని రోజులు వెండితెర ఆడియన్స్ ని అలరించిన అల్లు అర్జున్, ఇక నుండి బుల్లితెర ఆడియన్స్ ని కూడా అలరించబోతున్నాడా అంటే అవుననే అంటుంది ఆహా మీడియా టీం. త్వరలోనే అల్లు అర్జున్ కి సంబంధించిన ఒక సెన్సషనల్ అప్డేట్ తో మీ ముందుకు రాబోతున్నాము అంటూ కాసేపటి క్రితమే అధికారికంగా ఒక ప్రకటన చేసింది ఆహా టీం.

    ఇంతకీ ఆ ప్రకటన ఏమి అయ్యుంటుంది?, అల్లు అర్జున్ తో ఒక టాక్ షో ని ఏర్పాటు చేయబోతున్నారా?, లేదా ఏదైనా వెబ్ సిరీస్ ని ప్లాన్ చేయబోతున్నారా?, అసలు ఏమిటి ఆ న్యూస్ అని అభిమానులు ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. రేపు అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.ఇక పోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు.

    ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే షూటింగ్ కార్యక్రమాలు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయట. సంక్రాంతి లాంటి సీజన్ ని వదులుకునేది లేదని అల్లు అర్జున్ బలంగా నిర్మాతలకు చెప్పాడట. మరోపక్క అదే సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’ మరియు ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ చిత్రాలు కూడా విడుదల కాబోతున్నాయి.