https://oktelugu.com/

Producer Ravi Shankar: జానీ మాస్టర్ కేసుపై నోరు విప్పిన ‘పుష్ప 2 ‘ నిర్మాత.. అల్లు అర్జున్ ఇదంతా చేయిస్తున్నాడా? వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు!

జానీ మాస్టర్ వ్యవహారం మొత్తం పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం గా మాత్రమే చూడాలి. ఆయనపై ఆరోపణలు మోపిన అమ్మాయి 'పుష్ప 2' చిత్రానికి అడిషనల్ కొరియోగ్రాఫర్ గా పని చేసింది. ఆమెతో మేము ఎప్పటి నుండో పని చేస్తున్నాము. గణేష్ ఆచార్య మాస్టర్ మెయిన్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఏదైనా కొత్త స్టెప్పులు మాస్టర్ కి సూచిస్తే, ఆయనకి నచ్చితే పాటలో ఆ స్టెప్స్ ని పెట్టుకుంటాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 23, 2024 / 01:52 PM IST

    Producer Ravi Shankar

    Follow us on

    Producer Ravi Shankar: గత వారం రోజులుగా జానీ మాస్టర్ పై శ్రేష్టి వర్మ పెట్టిన లైంగిక వేధింపుల కేసు గురించి మీడియా లో ఏ రేంజ్ చర్చలు జరుగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. కేసు నిజమని రుజువు అయ్యేవరకు జానీ మాస్టర్ నేరస్తుడు కాదని, ఆయన ఎంతో కష్టపడి పైకొచ్చిన వ్యక్తి అని, ఆయన అలాంటి పనులు చేస్తే మేము నమ్మం అని, మేము జానీ మాస్టర్ కి వ్యక్తిగతం గా సపోర్టు చేస్తామని పలువురు సినీ సెలెబ్రిటీలు ముందుకొచ్చారు . మరికొందరు మాత్రం జానీ మాస్టర్ ని కఠినంగా శిక్షించాలని, ఇండస్ట్రీ లో ఆడవాళ్లపై లైంగిక వేధింపులు భవిష్యత్తులో చేయాలంటే భయపడాలి, ఆ స్థాయిలో ఆయనకీ శిక్ష పడాలి అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇలా ఆయనకీ సపోర్టు చేసేవారు ఉన్నారు, వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు.

    అలా వ్యతిరేకించే వారి జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఒక రూమర్. అల్లు అర్జునే దగ్గరుండి ఆ అమ్మాయి చేత కేసు వేయించాడని, ఆ అమ్మాయికి తన ప్రతీ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడంటూ సోషల్ మీడియా లో ఒక వార్త తెగ ప్రచారం అయ్యింది. అయితే దీనిపై పుష్ప 2 చిత్ర నిర్మాత నేడు స్పందించాడు.

    ఆయన మాట్లాడుతూ ‘జానీ మాస్టర్ వ్యవహారం మొత్తం పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం గా మాత్రమే చూడాలి. ఆయనపై ఆరోపణలు మోపిన అమ్మాయి ‘పుష్ప 2′ చిత్రానికి అడిషనల్ కొరియోగ్రాఫర్ గా పని చేసింది. ఆమెతో మేము ఎప్పటి నుండో పని చేస్తున్నాము. గణేష్ ఆచార్య మాస్టర్ మెయిన్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఏదైనా కొత్త స్టెప్పులు మాస్టర్ కి సూచిస్తే, ఆయనకి నచ్చితే పాటలో ఆ స్టెప్స్ ని పెట్టుకుంటాడు. అక్టోబర్ 14 నుండి తెరకెక్కించబోయే పాటలో కూడా ఆ అమ్మాయి ఉంటుంది. వాస్తవానికి ఈ చిత్రం లో వచ్చే ఐటెం సాంగ్ ని జానీ మాస్టర్ తో చేయించాలని అనుకుంటూ ఉన్నాం. కానీ ఇంతలోపే ఈ ఘటన జరిగింది. అల్లు అర్జున్ గారు ఆ అమ్మాయికి ప్రత్యేకంగా సినిమాలో అవకాశం ఇప్పించాడు అంటూ సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. కొన్ని యూట్యూబ్ చానెల్స్ ఈ అసత్య ప్రచారాలను మొదలు పెట్టింది. అల్లు అర్జున్ గారు డ్యాన్స్ టీం తో పెద్దగా మాట్లాడడు. సెట్స్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు పలకరిస్తే, నమస్కారం పెడుతాడంతే. ఆయన స్థాయికి ఇవన్నీ చాలా చిన్న విషయాలు. జానీ మాస్టర్, శ్రేష్టి వర్మ మధ్య జరుగుతున్నా గోలకు మాకు ఎలాంటి సంబంధం లేదు’ అంటూ నిర్మాత రవి శంకర్ క్లారిటీ ఇచ్చాడు. పుష్ప 2 కి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈయన ఇటీవలే ‘మత్తు వదలరా 2’ ని కూడా విడుదల చేసాడు. ఇటీవలే థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ సినిమా నిల్చిన సందర్భంగా నేడు మూవీ టీం సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులు రవి శంకర్ ని ఈ ప్రశ్న అడగగా, ఆయన ఇలా సమాధానం ఇచ్చాడు.