https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 సినిమా రిలీజ్ కచ్చితంగా అదే డేట్ ఫిక్సా?

ఒకవేళ వేసవి దాటిపోతే జూ. ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న దేవర సినిమా కూడా అదే స్టాట్ బుక్ చేసుకుంటుంది. ఇన్ని లెక్కల మధ్య పుష్ప బృందం తగ్గేదేలేదంటూ స్ఫష్టంగా పోస్ట్ పోన్ సమస్య లేదని అధికారికంగా స్పష్టం చేసింది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 12, 2024 / 05:00 PM IST
    Follow us on

    Pushpa 2: ఈ సంవత్సరం ఆగస్ట్ 15 మీద చాలా మంది దర్శకనిర్మాతలు కన్ను వేశారు. కారణం ఒకటే. ఎందుకంటే ఇప్పటికే ఈ డేట్ మీద పుష్ప 2 సినిమా వస్తుందనే నమ్మకం లేకపోవడంతో ఇతర సినిమాల దర్శకనిర్మాతలు హోప్స్ పెట్టుకున్నారు. దేవర లాగా వాయిదా వార్త రాకపోదా, వెంటనే లాక్ చేసుకోమా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అందులో మరీ ముఖ్యంగా నాని హీరోగా రాబోతున్న సరిపోదా శనివారం, కమల్ హాసన్ హీరోగా వస్తున్న భారతీయుడు 2 లాంటి క్రేజ్ మూవీస్ ఉన్నాయి.

    ఒకవేళ వేసవి దాటిపోతే జూ. ఎన్టీఆర్ హీరోగా రాబోతున్న దేవర సినిమా కూడా అదే స్టాట్ బుక్ చేసుకుంటుంది. ఇన్ని లెక్కల మధ్య పుష్ప బృందం తగ్గేదేలేదంటూ స్ఫష్టంగా పోస్ట్ పోన్ సమస్య లేదని అధికారికంగా స్పష్టం చేసింది. తాజాగా రష్మిక మందన సెట్లో దర్శకుడు సుకుమార్ ఫోటోని క్లిక్ చేసిన షేర్ చేసుకుంది. దాన్ని అఫీషియల్ గా మైత్రి మూవీ మేకర్స్ హ్యాండిల్ లో ట్వీట్ చేసి ఆగస్ట్ 15 డేట్ ని మరోసారి స్పష్టంగా చెప్పేశారు. సో ఆరు నూరైనా తప్పుకునే ఛాన్స్ లేదన్నమాట.

    ఇప్పటి దాకా యాభై శాతం పైగా షూటింగ్ పూర్తైన పుష్ప 2 ని జూలై లోగా పోస్ట్ ప్రొడక్షన్ తో సహా గుమ్మడికాయ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కనీసం ఒక నెల రోజులు ప్రమోషన్ లకు అవసరం కాబట్టి అవసరమైన ఒత్తిడిని రాకుండా చూడమని అల్లు అర్జున్ చెప్పిన సూచనల మేరకు పక్కా ప్లానింగ్ తో చిత్రీకరణ జరుగుతోంది. ఓ కేసులో జైలుకు వెళ్లి బెయిలు మీద బయటకు వచ్చిన ఆర్టిస్టు జగదీశ్ తో ఉన్న కాంబో సీన్లన్ని ముందు తీస్తున్నారు. జాతర ఎపిసోడ్ దాదాపు అయిపోయిందని టాక్.

    పుష్ప 3 గురించి గట్టిగా వినిపిస్తున్న తరుణంలో మూడో భాగం ఉంటుందా లేదా అనే దాని గురించి టీమ్ ఎలాంటి విషయం చెప్పడం లేదు. సినిమా చూశాక చివర్ లో సర్ ప్పైజ్ ఇస్తారో చూడాలి. లేద విడుదలైన తర్వాత లేదా ప్రమోషన్ వీడియాలో ఏదైనా విషయం చెబుతారో చూడాలి.