Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం విజయవంతంగా థియేటర్స్ లో రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఈ రెండు వారాలు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నెలకొల్పిన రికార్డ్స్ ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ఏ సినిమా కూడా నెలకొల్పలేదు అని చెప్పొచ్చు. మొదటి వారం లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఫాస్టెస్ట్ 1500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఏకైక ఇండియన్ సినిమాగా మరో చరిత్ర సృష్టించింది. టాలీవుడ్ లో ఈ చిత్రానికి వసూళ్లు రోజు రోజుకి గణనీయంగా తగ్గిపోతున్నాయి కానీ, హిందీ వెర్షన్ వసూళ్లు మాత్రం స్టడీ గా ఉంటున్నాయి. నిన్న కూడా ఈ చిత్రానికి 26 కోట్ల రూపాయిల గ్రాస్ కేవలం హిందీ వెర్షన్ నుండి వచ్చాయట.
అక్కడి ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం 15 వ రోజు ఈ చిత్రానికి 19 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయని, రాజమౌళి తెరకెక్కించిన #RRR మొదటి రోజు హిందీ వసూళ్ల కంటే, పుష్ప 15 వ రోజు వసూళ్లు ఎక్కువ వచ్చాయని అక్కడి ట్రేడ్ పండితులు అంటున్నారు. వర్కింగ్ డేస్ లోనే ఈ రేంజ్ లో ఉందంటే , కచ్చితంగా ఈ వీకెండ్ లో కూడా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఉగ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని. మూడవ వీకెండ్ లో 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు. ఇక తెలుగు వెర్షన్ లో ఈ చిత్రానికి 15 వ రోజు కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తమిళం, మలయాళం, కన్నడ భాషలకు కలిపి కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.
ఓవరాల్ గా 15 వ రోజు ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, వరల్డ్ వైడ్ గా 1500 కోట్లు రాబట్టింది నిర్మాతలు అధికారిక ప్రకటన చేసారు. అయితే నిర్మాతలు ప్రొమోషన్స్ కోసం ఇలాంటి పోస్టర్స్ విడుదల చేయడం సహజం. కానీ నిజానికి ఈ చిత్రానికి ఇప్పటి వరకు 1460 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు. ఒక్క నైజాం ప్రాంతంలోనే ఈ సినిమాకి 81 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ ప్రాంతంలో #RRR రికార్డు బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. #RRR ఈ ప్రాంతంలో దాదాపుగా 110 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఈ రికార్డుని బద్దలు కొట్టడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ పుష్ప 2 లాంటి కమర్షియల్ చిత్రం అవలీలగా ఈ రికార్డుని దాటేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.