Pushpa 2 The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం సృష్టించిన ప్రభంజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాదు, ప్రతీ తెలుగోడు గర్వించదగ్గ రికార్డ్స్ ని ఈ చిత్రం నెలకొల్పింది. సినిమా విడుదలై 50 రోజులు దాటింది, ఓటీటీ లో కూడా వచ్చేసింది, కానీ ఇప్పటికీ ఈ చిత్రం నార్త్ ఇండియా లో అత్యధిక షోస్ తో ప్రదర్శితమవుతోంది అంటే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఆల్ టైం ఇండియన్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఇండియన్ సినిమా చాలా కాలం తర్వాత చూసిన నిజమైన సక్సెస్ కాబట్టి అభిమానులు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సక్సెస్ ఈవెంట్స్ ని ఏర్పాటు చేయాలనీ కోరుకున్నారు. అల్లు అర్జున్ ప్రసంగాన్ని వినేందుకు అమితాసక్తిని చూపించారు.
కానీ సంధ్య థియేటర్ లో జరిగిన దురదృష్టకర సంఘటన కారణంగా మూవీ టీం సక్సెస్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకున్నా, వాటిని రద్దు చేయాల్సి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదల అయ్యాక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుండడంతో ఎలా అయినా ఈరోజు సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయాల్సిందే అని మూవీ టీం నిర్ణయించుకుంది. కాసేపటి క్రితమే ఈ సక్సెస్ మీట్ మొదలైంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ తర్వాత బాగా పాపులర్ అయినా క్యారక్టర్ కేశవ. ఈ క్యారక్టర్ ని జగదీశ్ అనే కొత్త నటుడు చేసాడు. రాత్రికి రాత్రి జగదీశ్ కూడా అల్లు అర్జున్ తో పాటు పాన్ ఇండియన్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. రెండు సినిమాల్లోనూ ఆయన అల్లు అర్జున్ ఉన్న ప్రతీ సన్నివేశం లోనూ ఉన్నాడు. కొత్త నటుడికి ఇంతటి అదృష్టం దొరకడం అనేది సాధారమైన విషయం కాదు.
నేడు జరిగిన సక్సెస్ మీట్ లో జగదీశ్ కూడా పాల్గొన్నాడు. ఈ సక్సెస్ మీట్ లో ఆయన ఎమోషనల్ గా మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘ఒక కొత్త నటుడికి అల్లు అర్జున్ గారి లాంటి సూపర్ స్టార్ పక్కన నటించే అవకాశం రావడం అనేది చిన్న విషయం కాదు. ఈ క్యారక్టర్ కి కొత్త ముఖాన్ని ఆడియన్స్ కి పరిచయం చేయాలనే ఉద్దేశ్యం తో సుకుమార్ గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమా చేసిన తర్వాత నేను చనిపోయిన పర్వాలేదు అనుకున్నాను. అంతటి కిక్ ని ఇచ్చింది ఈ చిత్రం. అల్లు అర్జున్ గారు కూడా నాకు ఎంతో ప్రోత్సాహం అందించారు. ఏదైనా సన్నివేశం అర్థం కాక, ఎక్కువ టేకులు నేను తీసుకోవాల్సి వచ్చింది. అల్లు అర్జున్ గారు ఎలాంటి చిరాకు పడకుండా, చాలా ఓపిగ్గా నాకోసం చేసారు’ అంటూ చెప్పుకొచ్చాడు జగదీశ్.