Mahesh Babu- Rajamouli Movie : సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం కేవలం అభిమానులు మాత్రమే కాదు, సినిమా అనే ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేసే ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు సినిమాని వీళ్లిద్దరు అనేక సార్లు వాళ్ళ స్టైల్ లో మరో లెవెల్ కి తీసుకెళ్లారు. కానీ మహేష్ బాబు మాత్రం వరుసగా ఫ్లాప్స్ రావడం వల్ల ప్రయోగాల జోలికి పోకుండా, కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే చేస్తూ ఈమధ్య కాలం లో ముందుకెళ్తున్నాడు. టాక్ కాస్త యావరేజ్ గా వచ్చినా అవి కమర్షియల్ గా సక్సెస్ అయ్యాయి. కానీ అభిమానులకు ఇది సరిపోవడం లేదు. ఎందుకంటే ఈమధ్య కాలంలో ప్రతీ హీరో పాన్ ఇండియా లెవెల్ లో కొత్త తరహా కథలతో ఆడియన్స్ ని అలరిస్తూ అందనంత ఎత్తులో ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే మహేష్ బాగా వెనుకబడ్డాడు.
ఇప్పుడు రాజమౌళి తో చేయబోయే సినిమాతో ఇంత కాలం అభిమానులకు పడ్డ బాకీని తీర్చేయబోతున్నాడు. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కబోయే ఈ సినిమాని వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. రీసెంట్ గానే బాలీవుడ్/హాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అల్యూమినియం ఫ్యాక్టరీ లో జరుగుతున్నా వర్క్ షాప్ సెట్స్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆమెకు సంబంధించిన లుక్ టెస్ట్ ని ఈ వర్క్ షాప్ లో పూర్తి చేసారు. ఇందులో ఆమె మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుందని అందరూ అనుకున్నారు కానీ, ఆమెని తీసుకుంది విలన్ పాత్ర కోసం అని తెలుస్తుంది. ఇది వరకే ప్రియాంక చోప్రా బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాలలో విలన్ క్యారెక్టర్స్ చేసి మంచి పాపులారిటీ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా హాలీవుడ్ ఆడియన్స్ అయితే ఆమెని విలన్ గానే గుర్తిస్తారు. అందుకే ఆ పాత్ర కోసం ఆమెని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా హీరోయిన్ ని కూడా బాలీవుడ్ వైపు నుండే తీసుకోబోతున్నారట.
ఇకపోతే ఈ సినిమాకి టైటిల్ ‘మహారాజ్’ అని కొందరు, ‘గరుడ’ అని మరికొందరు ప్రచారం చేసారు. కానీ పాన్ వరల్డ్ మొత్తానికి కామన్ టైటిల్ గా ఉండేలా ‘జనరేషన్’ అనే పదం వచ్చేట్టు టైటిల్ ఫిక్స్ చేశాడట రాజమౌళి. త్వరలోనే ఈ టైటిల్ ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంతే కాకుండా ఇందులో తండ్రి పాత్ర కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగింది అట. ముందుగా ఈ పాత్ర కోసం అక్కినేని నాగార్జున ని తీసుకోవాలని అనుకున్నారు కానీ, ఇప్పుడు ఆ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ ని ఎంచుకున్నారట. వచ్చే నెల మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ చిత్రం స్టోరీ చాలా పెద్దది అవ్వడం తో మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడట డైరెక్టర్ రాజమౌళి