Pushpa 2: పుష్ప-2 రిలీజ్ కు ముందే కళ్లు చెదిరే బిజినెస్.. షాకవుతున్న బాలీవుడ్

ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని ఇటీవల అల్లు అర్జున్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Written By: Mahi, Updated On : October 17, 2024 5:08 pm

Pushpa 2

Follow us on

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తు్న్న తాజా చిత్రం పుష్ప 2: ది రూల్ కోసం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని ఇటీవల అల్లు అర్జున్ ప్రకటించిన విషయం తెలిసిందే. తన అభిమానులు కాలర్ ఎగరేసుకొని తగ్గేదేలే అని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పొచ్చని భరోసా ఇచ్చాడు. పుష్ప పార్ట్ వన్ దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. బన్నీ కెరీర్ లోనే కనివీనీ ఎరుగని సక్సెస్ సాధించింది. దీంతో పార్ట్-2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15న విడుదలవుతుందటూ గతంలో ప్రకటించగా పలు బాలీవుడ్ సినిమాలు తమ రిలీజ్ డేట్ ను మార్చుకున్నాయి. ఇప్పుడు డిసెంబర్ 6న కచ్చితంగా రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ఆ నెలలో విడుదల కావాల్సిన సినిమాలు కూడా తమ డేట్లు మార్చుకునే పనిలో పడ్డాయి.

బీ టౌన్ టాక్ ఆఫ్ ది మూవీగా పుష్ప-2
అయితే పుష్ప-2 గురించి బాలీవుడ్ లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. పార్ట్-1 సక్సెస్ ఇచ్చిన బూస్ట్ పార్ట్-2పైనా ప్రభావం చూపుతున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ లోనే కనీవినీ ఎరుగని రేంజ్ లో బిజినెస్ చేసిందనే చర్చ బీ టౌన్ లో సాగుతున్నది. సినిమా మొదటి భాగం ప్రేక్షకులకు బాగా నచ్చిన విషయం తెలిసిందే. హిందీలో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. పుష్ప-2 విడుదలకు ముందే రూ. 900 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని బీ టౌన్ లో టాక్ నడుస్తున్నది. ఓ ఓటీటీ భారీ మొత్తానికి స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తున్నది.

థియేటర్ బిజినెస్ ఎంతంటే ?
2021లో విడుదలైన పుష్ప: ది రైజ్ తర్వాత అల్లు అర్జున్ హిందీ ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. మొదటి భాగం చూసిన ప్రతి ఒక్కరూ పార్ట్ -2 కోసం ఎదురుచూస్తున్నారు. మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు ఇస్తూనే ఉన్నారు.
ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 900 కోట్లు చేసినట్లు సమాచారం. ఇందులో ఓటీటీ, శాటిలైట్ హక్కులు కూడా ఉన్నాయి. అయితే చిత్ర నిర్మాతల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ సినిమా థియేటర్ రైట్స్ రూ. 650 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తున్నది.

స్ట్రీమింగ్ ఈ ఓటీటీలోనే
పుష్ప 2 హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ రూ.270 కోట్లకు తీసుకున్నట్లు చర్చ జరుగుతుున్నది. దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో పుష్ఫ-2ను తెరకెక్కిస్తున్నారు.