Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ నుండి సంచలన అప్డేట్..విలన్ గా మాస్ హీరో..ఈ కాంబినేషన్ కి 2000 రావడం పక్కా!

మాస్ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న గోపీచంద్, ప్రభాస్ అడిగితే ఎలాంటి క్యారక్టర్ చేయడానికైనా సిద్ధం అంటూ ఇటీవల జరిగిన ఇంటర్వ్యూస్ లో తెలిపాడు.

Written By: Vicky, Updated On : October 17, 2024 5:05 pm

Prabhas Fauji(1)

Follow us on

Fauji: వరుసగా పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్స్ తో ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా, ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాత్రమే. ‘బాహుబలి’ సిరీస్ తర్వాత ‘సాహూ’, ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ వంటి వరుస ఫ్లాప్ సినిమాలు వచ్చాయి కానీ, ఆ తర్వాత వచ్చిన ‘సలార్’, ‘కల్కి’ చిత్రాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఆటం బాంబులు లెక్క పేలాయి. సలార్ చిత్రానికి 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాగా, కల్కి చిత్రానికి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్ ‘రాజా సాబ్’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా తర్వాత రీసెంట్ గానే ఆయన హను రాఘవపూడి తో ‘ఫౌజీ’ అనే చిత్రాన్ని ప్రారంభించాడు. హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రభాస్ లేకుండా జరుగుతుంది. పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రజాకార్ ఉద్యమ నేపథ్యంలో సాగుతుందట. ఇందులో ప్రభాస్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా నటించబోతున్నాడు. ఒక ఇండియన్ ఆర్మీ ఆఫీస్ కి, పాకిస్థాన్ అమ్మాయికి మధ్య జరిగే లవ్ స్టోరీ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. రీసెంట్ గానే ద్వారకా లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది ఈ చిత్రం. వచ్చే నెలలో ప్లాన్ చేసిన షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో విలన్ క్యారక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. హీరో క్యారక్టర్ కంటే కూడా విలన్ క్యారక్టర్ హైలైట్ గా నిలుస్తుందట. ఈ క్యారక్టర్ కోసం ప్రభాస్ ప్రాణ స్నేహితుడు గోపీచంద్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. గతం వీళ్లిద్దరు కలిసి వర్షం చిత్రం లో నటించారు. మళ్ళీ ఇన్నాళ్లకు వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఈ చిత్రం రాబోతుంది.

మాస్ హీరో గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న గోపీచంద్, ప్రభాస్ అడిగితే ఎలాంటి క్యారక్టర్ చేయడానికైనా సిద్ధం అంటూ ఇటీవల జరిగిన ఇంటర్వ్యూస్ లో తెలిపాడు. కేవలం ప్రభాస్ అడిగితేనే చేస్తానని, మిగిలిన హీరోలకు చేయనని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. ఇటీవలే విశ్వం సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న గోపీచంద్ కి తదుపరి చిత్రం గా ఫౌజీ నే ఉండబోతుంది. ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా లెవెల్ లో ఫేమస్ అయిపోతాడు, అవకాశాలు క్యూలు కడుతాయి, దానిని ఈయన సరిగ్గా ఉపయోగించుకుంటాడా లేదా అనేది చూడాలి.