Pushpa 2 The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ‘ చిత్రం భారత దేశంలో చెక్కుచెదరకుండా ఉన్నటువంటి పలు ఆల్ టైం రికార్డ్స్ ని కూడా పైకి లేపి బద్దలు కొడుతుండడం అందరినీ షాక్ కి గురి చేస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ చిత్రం ఆరోజుల్లోనే సంధ్య 70MM థియేటర్ లో కోటి 58 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ రికార్డు దాదాపుగా పాతికేళ్ళు పదిలంగా ఉన్నింది. ఈమధ్య గ్యాప్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలు, ఎన్నో పాన్ ఇండియన్ సంచలనాలు విడుదలయ్యాయి. కానీ ఒక్క చిత్రం కూడా ఈ థియేటర్ రికార్డు ని బద్దలు కొట్టలేకపోయింది. అలాంటి రికార్డుని పుష్ప 2 చిత్రం గత నెలలో బద్దలు కొట్టింది. ఇప్పుడు 16 ఏళ్ళ జూనియర్ ఎన్టీఆర్ రికార్డు ని కూడా బద్దలు కొట్టబోతుంది ఈ సినిమా.
2007 వ సంవత్సరం లో విడుదలైన ఎన్టీఆర్ యమదొంగ చిత్రం 400 కేంద్రాలలో అర్థ శత దినోత్సవం ని జరుపుకుంది. ఈ రికార్డు ని ఇప్పటి వరకు ఎవ్వరూ అందుకోలేకపోయారు. ఓటీటీ యుగం మొదలయ్యాక అసలు 50 రోజులు, 100 రోజుల రికార్డ్స్ ని జనాలు మర్చిపోయారు. అలాంటి రోజుల్లో కూడా పుష్ప 2 చిత్రం 50 రోజుల కేంద్రాల విషయం లో సరికొత్త రికార్డు ని నెలకొల్పబోతుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆల్ ఇండియా వైడ్ గా కలిపి 500 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుందని తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో 150 సెంటర్స్ (షిఫ్ట్ + డైరెక్ట్) లో 50 రోజులు ఆడే అవకాశం ఉంది. రీసెంట్ గా విడుదలైన పాన్ ఇండియన్ మూవీస్ అన్నిట్లో పుష్ప 2 సృష్టించిన ఈ రికార్డు ని భవిష్యత్తులో బద్దలు కొట్టడం చాలా కష్టమే.
అదే విధంగా రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించి 20 నిమిషాల అదనపు ఫుటేజీ ని జత చేసి మరోసారి థియేటర్స్ లో విడుదల చేసారు. రెస్పాన్స్ అదిరిపోయింది. ఇవి కూడా 50 రోజుల సెంటర్స్ లిస్ట్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. బుక్ మై షో యాప్ లో ఈ సినిమా కి ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని చూస్తుంటే వంద రోజులు కూడా ఆడేలాగా అనిపిస్తుంది. రోజుకి సగటున 30 వేల టిక్కెట్లు 40 రోజులు దాటిన తర్వాత కూడా అమ్ముడుపోతున్నాయంటే సాధారణమైన విషయం కాదు. ఈ సినిమా సక్సెస్ అవుతుందని అందరూ ఊహించిందే. కానీ ఈ స్థాయి సక్సెస్ అవుతుందని మాత్రం ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఇంతటి రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందంటే కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్స్ కి కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.