https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : మొదలైన టైటిల్ విన్నర్ ఓటింగ్..నిఖిల్ టాప్ లో ఉన్నాడు అనుకుంటే పొరపాటేనా..? పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!

బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరో మరో వారం రోజుల్లో తెలియనుంది. ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో జరిగిన గొడవలు, కంటెస్టెంట్స్ ఆడిన టాస్కులు, ప్రవర్తించిన తీరు, వీటి అన్నిటికి జనాలు తుది తీర్పుని ఇవ్వబోతున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 9, 2024 / 09:43 AM IST

    Nikhil

    Follow us on

    Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరో మరో వారం రోజుల్లో తెలియనుంది. ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో జరిగిన గొడవలు, కంటెస్టెంట్స్ ఆడిన టాస్కులు, ప్రవర్తించిన తీరు, వీటి అన్నిటికి జనాలు తుది తీర్పుని ఇవ్వబోతున్నారు. వీకెండ్ ఎపిసోడ్స్ తో రోహిణి, విష్ణు ప్రియ ఎలిమినేట్ అయ్యాక గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్ మరియు అవినాష్ టాప్ 5 కంటెస్టెంట్స్ గా మిగిలారు. వీరిలో నిఖిల్, గౌతమ్ మధ్య మాత్రమే టైటిల్ విన్నింగ్ రేస్ ఉంది. మిగిలిన కంటెస్టెంట్స్ వీళ్లిద్దరి దరిదాపుల్లో కూడా లేరు. ఇంస్టాగ్రామ్ పోల్స్ లో అత్యధిక శాతం మంది జనాలు గౌతమ్ కి ఓట్లు వేస్తుండగా, యూట్యూబ్ పోల్స్ లో మాత్రం నిఖిల్ కి ఎక్కువ ఓట్లు వేస్తున్నారు. ట్విట్టర్ లో కూడా గౌతమ్ హవానే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ యూట్యూబ్ లో మాత్రం ఇద్దరి మధ్య తేడా చాలా భారీగా ఉంది.

    ఈ తేడా ని చూసి నిఖిల్ మాత్రమే టైటిల్ కొట్టబోతున్నాడు అనుకుంటే ఆయన అభిమానులు పప్పులో కాలేసినట్టే అని అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే యూత్ ఆడియన్స్ లో కచ్చితంగా గౌతమ్ కంటే నిఖిల్ కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ లో మాత్రం గౌతమ్ కి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోలోగా అతను ఆడిన ఆట తీరు జనాలకు బాగా నచ్చింది. ఇతను అన్యాయంగా ఏమి చెయ్యట్లేదు, న్యాయంగానే వెళ్తున్నాడు ప్రతీ విషయంలో, టాస్కులు కూడా చాలా బాగా ఆడుతున్నాడు అనే అభిప్రాయం వారిలో చాలా బలంగా ఉంది. అందుకే గౌతమ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం ఒక రేంజ్ లో ఓట్లు వేస్తున్నట్టు సమాచారం. నిన్న అర్థరాత్రి నుండి ఓటింగ్ మొదలైంది. ఈ ఓటింగ్ లో గౌతమ్ మరియు నిఖిల్ మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉంది.

    ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది చెప్పడం ఇప్పటికీ కష్టమేనట. ఒక గంట నిఖిల్ లీడింగ్ లో ఉంటే, మరో గంటలో గౌతమ్ లీడింగ్ లోకి వస్తున్నాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య పోరు చాలా తీవ్రమైపోయింది. ఇక మిగిలిన మూడు స్థానాల్లో మూడవ స్థానం కి కూడా చాలా గట్టి పోటీ ఉంది. నబీల్, ప్రేరణ కి పోటాపోటీగా ఓట్లు పడుతున్నాయి కానీ, నబీల్ కి ఉన్నంత సైలెంట్ ఓటింగ్ ప్రేరణకి లేదు. సోషల్ మీడియా పోల్స్ చూస్తే ప్రేరణనే మూడవ స్థానంలో ఉంటుంది. కానీ నబీల్ కి ఒక సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది అనేది మాత్రం వాస్తవం. కాబట్టి మూడవ స్థానంలో నబీల్, నాల్గవ స్థానం లో ప్రేరణ నిలబడొచ్చు. ఇక చివరి స్థానంలో అవినాష్ ఉంటాడు అనే విషయం మన అందరికీ తెలిసిందే. చూడాలి మరి ఈ చివరి వారం ఆడియన్స్ ని ఎవరు ఎక్కువగా ఆకర్షిస్తారో, ఎవరు టైటిల్ కొట్టబోతున్నారో అనేది.