Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన ‘పుష్ప 2′(Pushpa 2 Movie) చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో మనమంతా చూసాము. ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలు అల్లు అర్జున్ నటన, డైరెక్టర్ సుకుమార్ టేకింగ్ లతో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉండడం మరో కారణం. అయితే ఈ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అందించినది ఎవరు? అనే దానిపై పెద్ద చర్చ జరిగింది అప్పట్లో. దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) అనుకున్న సమయానికి మ్యూజిక్ డెలివరీ చేయకపోవడంతో విసుగెత్తిపోయిన నిర్మాతలు, థమన్ ని సంప్రదించారని, ‘పుష్ప 2’ మొత్తానికి ఆయనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తాడని ప్రచారం జరిగింది. అంతే కాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవి శ్రీ ప్రసాద్ నిర్మాతలపై అసహనం వ్యక్తం చేయడంతో జరుగుతున్న ప్రచారం నిజమేనని అంతా అనుకున్నారు.
Also Read : పుష్ప 2′ ని వెనక్కి నెట్టేసిన ‘మ్యాడ్’..చరిత్రలో ఇదే తొలిసారి!
అయితే దీనిపై థమన్(SS Thaman) ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘ పుష్ప 2 కోసం డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) గారు నన్ను సంప్రదించిన విషయం వాస్తవమే. నేను ఈ చిత్రానికి పది రోజుల పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం పని చేసాను. ఏకంగా మూడు వెర్షన్స్ తయారు చేసి సుకుమార్ గారికి పంపాను. కానీ ఎందుకో ఆయనకు అది నచ్చినట్టు లేదు. చివరికి దేవిశ్రీ ప్రసాద్, సామ్ సీఎస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని వాడుకున్నారు. నేను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని వాడుకోలేదని నేను బాధపడలేదు. ఎందుకంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని కేవలం సుకుమార్ ఒక్కరే అంగీకరించలేరు, టీం మొత్తం అంగీకరించాలి, వాళ్లకు కచ్చితంగా నచ్చి తీరాలి, కాబట్టి నేను అర్థం చేసుకోగలను’ అంటూ చెప్పుకొచ్చాడు థమన్. ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
అయితే ‘పుష్ప 2 ‘ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ కి థియేటర్స్ లో రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో దేవిశ్రీప్రసాద్ కి నిజంగానే అమ్మోరు పూనిందా నా కొట్టాడు అని ఆడియన్స్ అనుకునేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు. అదే విధంగా క్లైమాక్స్ లో వచ్చే ‘రప్పా..రప్పా’ ఫైట్ సన్నివేశం కోసం దేవిశ్రీ ప్రసాద్ అసలు ఏమి తాగి కొట్టాడు రా బాబు, మైండ్ నుండి పోవడం లేదని అందరు అనుకున్నారు. మొదటి నుండి పుష్ప సినిమా కథతో జర్నీ చేయడం వల్ల దేవిశ్రీ ప్రసాద్ ఆ సినిమాకు ఆ రేంజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగలిగాడు. థమన్ ఈ సినిమాలోకి కొత్తగా అడుగుపెట్టినవాడు కాబట్టి, ఆ రేంజ్ ని మ్యాచ్ చేయలేకపోయుండొచ్చు అని విశ్లేషకులు అంటున్నారు.
Also Read : ఆస్కార్ కి పుష్ప 2… అయితే ఎన్ని కోట్లు ఖర్చు చేయాలో తెలుసా?