Pushpa 2-Mad : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన ‘పుష్ప 2′(Pushpa 2 Movie) చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పిందో మనమంతా చూసాము. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రాబట్టిన వసూళ్లను చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే. ముఖ్యంగా బాలీవుడ్ విశ్లేషకులు, అక్కడి హీరోలు పుష్ప 2 హిందీ వెర్షన్ వసూళ్లను చూసి కుల్లుకున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు ఓటీటీ లో మాత్రం అనుకున్న రేంజ్ లో హిట్ అవ్వలేదనే చెప్పాలి. నెట్ ఫ్లిక్స్(NetFlix) లో విడుదలైన ఈ సినిమా 9 వారాలు అన్ని భాషలకు కలిపి ట్రెండ్ అయ్యింది. 9 వారాలు అంటే మంచి రన్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ తో పోలిస్తే చాలా అంటే చాలా తక్కువ అనొచ్చు.
Also Read : ఒక్కరోజు గ్యాప్ లో రానున్న’పెద్ది’, ‘ది ప్యారడైజ్’..నాని వెనక్కి వెళ్ళక తప్పదా?
ఎందుకంటే ‘లక్కీ భాస్కర్'(Netflix) చిత్రం ఏకంగా 15 వారాలు ట్రెండ్ అయ్యింది. అల్లు అర్జున్ నటించిన ‘అలా వైకుంఠపురంలో’ చిత్రం అయితే ఏకంగా 32 వారాలు ట్రెండ్ అయ్యింది. #RRR చిత్రం 22 వారాలు ట్రెండ్ అయ్యింది. ‘పుష్ప 2’ సాధించిన బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని పరిగణలోకి తీసుకుంటే, ఈ చిత్రం కచ్చితంగా పైన చెప్పిన సినిమాల క్యాటగిరీలో ఉండాల్సిన చిత్రం. కానీ కేవలం సూపర్ హిట్ రేంజ్ లోనే నిల్చింది. విచిత్రం ఏమిటంటే ‘మ్యాడ్'(Mad Movie) చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ టాప్ 10 లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఎంట్రీ తో ‘పుష్ప 2’ చిత్రం టాప్ 10 నుండి వైదొలిగింది. ఎప్పుడో 2023 వ సంవత్సరం లో వచ్చిన సినిమా ఇప్పుడు ట్రెండింగ్ లోకి రావడం ఏమిటి?, ఆ సినిమా కారణంగా పుష్ప 2 నుండి ట్రెండింగ్ నుండి తప్పుకోవడం ఏమిటి? చాలా విచిత్రంగా ఉందే అంటూ కొంతమంది సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
కానీ ‘మ్యాడ్’ చిత్రం ఇప్పుడు ట్రెండ్ లోకి రావడానికి ప్రధాన కారణం ‘మ్యాడ్ స్క్వేర్’. ఈ సినిమా రీసెంట్ గానే విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని దిగ్విజయంగా థియేటర్స్ లో రన్ అవుతుంది. ఈ చిత్రాన్ని చూడాలి అనుకుంటే, ముందు సినిమాని కచ్చితంగా చూడాలి కదా. అందుకే ‘మ్యాడ్’ చిత్రం ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతుంది. మ్యాడ్ స్క్వేర్ చిత్రానికి ఇప్పటి వరకు దాదాపుగా 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇంకా ఎక్కువ వసూళ్లను రాబడుతుందని నిర్మాతతో పాటు బయ్యర్స్ కూడా ఆశించారు కానీ, టాక్ యావరేజ్ రేంజ్ లో ఉండడం వల్ల పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయింది ఈ చిత్రం. రాబోయే రోజుల్లో మరో పది కోట్ల రూపాయిల గ్రాస్ అదనంగా రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
Also Read : పెద్ది’ ని ‘దసరా’ తో పోలుస్తున్న నెటిజెన్స్..రెండిటి మధ్య ఉన్న తేడాలు ఇవే!