Homeఎంటర్టైన్మెంట్Pushpa 2: పుష్ప 2: అల్లు అర్జున్ ముందు భారీ టార్గెట్, ఆర్ ఆర్ ఆర్...

Pushpa 2: పుష్ప 2: అల్లు అర్జున్ ముందు భారీ టార్గెట్, ఆర్ ఆర్ ఆర్ ని కొడితేనే హిట్!

Pushpa 2: అల్లు అర్జున్ కెరీర్ పుష్పకు ముందు పుష్ప తర్వాత అని డివైడ్ చేయవచ్చు. అల్లు అర్జున్ ఇమేజ్ ని పుష్ప తారాస్థాయికి తీసుకెళ్లింది. ఆయనకు ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ అల్లు అర్జున్ అంటే అమితంగా అభిమానిస్తున్నారు. నార్త్ లో అల్లు అర్జున్ క్రేజ్ ఏమిటో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో రుజువైంది. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రెండు లక్షలకు పైగా అభిమానులు వచ్చారనేది, విశ్వసనీయ సమాచారం.

పుష్ప 2 చిత్రానికి ఇంత డిమాండ్ ఉంది కాబట్టే.. హిందీ రైట్స్ రికార్డు స్థాయిలో పలికాయి. ఏకంగా రూ. 200 కోట్లు చెల్లించి దక్కించుకున్నారని సమాచారం. కల్కి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలు కూడా ఈ స్థాయిలో బిజినెస్ చేయలేదు. ఆర్ ఆర్ ఆర్ రూ. 100 కోట్లు, కల్కి రూ. 110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. పుష్ప 2 హిందీ వెర్షన్ ఒక్కటే రూ. 500 కోట్ల వసూళ్లు రాబడుతుంది అనేది ట్రేడ్ వర్గాల అంచనా. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పుష్ప 2 భారీగా వసూళ్లు రాబట్టాల్సి ఉంది.

ఏపీ/తెలంగాణాలలో కూడా కల్కి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల థియేట్రికల్ బిజినెస్ ని పుష్ప 2 దాటేసింది . ఒక్క నైజాం హక్కులను రూ. 100 కోట్లకు అమ్మారు. ఇక ఆంధ్ర, సీడెడ్ కలిపి రూ. 120 కోట్లు పలికాయట. ఈ క్రమంలో పుష్ప 2 తెలుగు రాష్ట్రాల్లో లాభాలు రాబట్టాలంటే.. వందల కోట్ల వసూళ్లు అందుకోవాలి.

మొత్తంగా ఏపీ/తెలంగాణలలో పుష్ప 2 రూ. 220 కోట్ల షేర్, రూ. 450 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. అంత పెద్ద టార్గెట్ పుష్ప 2 ఎదుట ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ రూ. 415 కోట్ల గ్రాస్ వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ఉంది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ రికార్డు అల్లు అర్జున్ బ్రేక్ చేస్తేనే హిట్ అన్నమాట. డిసెంబర్ 5న పుష్ప 2 వరల్డ్ వైడ్ విడులవుతున్న సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular