Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతూనే ఉంది. ఇతర బాషల వసూళ్లు ఇప్పుడు కాస్త తగ్గినప్పటికీ, హిందీ వెర్షన్ లో మాత్రం రెండవ సోమవారం రోజు కూడా ఆశ్చర్యపరిచే గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఎన్నో ఏళ్ళ నుండి బాలీవుడ్ సినిమాల వసూళ్లను పరిశీలిస్తూనే ఉన్నాం కానీ, ఈ రేంజ్ లో ఒక సినిమా పని దినాల్లో కూడా దుమ్ము లేపడం అనేది మొట్టమొదటిసారి చూస్తున్నాం. భవిష్యత్తులో ఖాన్స్ కి కూడా ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం కష్టమే అని ట్రేడ్ పండితులు అంటున్నారు. సోమవారం రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ప్రాంతాల వారీగా 12 రోజులకు ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
హిందీ వెర్షన్ లో ఈ చిత్రం 12 వ రోజు 27 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిందట. గ్రాస్ లెక్కల్లో చూస్తే 33 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. అదే విధంగా తెలుగు వెర్షన్ లో ఈ సినిమాకి నిన్న 6 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఇక ఆ తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడు , ఓవర్సీస్ వంటి ప్రాంతాలకు కలిపి మొత్తం మీద 42 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను 12 వ రోజు ఈ చిత్రం రాబట్టినట్టు తెలుస్తుంది. హిందీ వెర్షన్ లో భారీ లాభాలు రాగా, మిగిలిన అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఇప్పటి వరకు 193 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 20 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది.
12 రోజులకు వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లను ప్రాంతాల వారీగా ఒక్కసారి లెక్కగడితే తెలుగు రాష్ట్రాల్లో 288 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, కర్ణాటక లో 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు ఈ 12 రోజులకు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా తమిళనాడు 70 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టగా, కేరళలో 18 కోట్ల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా సౌత్ స్టేట్స్ మొత్తం కలిపి 476 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఈ 12 రోజులకు వచ్చాయట. ఇక నార్త్ ఇండియా వసూళ్లు అయితే ఏకంగా 660 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 1136 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ కూడా కలిపితే 1386 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు చెప్తున్నారు. కానీ నిర్మాతలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ చిత్రానికి 1500 కోట్ల రూపాయిలు వచ్చాయట.