Puri Jagannath: ‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ఏం మాట్లాడినా అద్భుతమే, కొత్త జనరేషన్ కు ఆ మాటలే గొప్ప పాఠాలు. అందుకే ‘పూరీ మ్యూజింగ్స్’కి లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మనకు తెలియని ఎన్నో విషయాలను ముఖ్యంగా ప్రపంచంలోని వింతలను, విశేషాలను తనదైన శైలిలో ఆసక్తికరంగా చెప్పుకొస్తోన్న ఈ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాడు. టాపిక్ పేరు ‘హాలీవుడ్’.

మరి హాలీవుడ్ గురించి పూరి మాటల్లోనే.. ‘హాలీవుడ్ అసలు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ? ముందు ఈ హాలీవుడ్ పేరు తెలియనోళ్లంటూ ఉండరు. పైగా హాలీవుడ్ సినిమాల్లో పని చేయాలన్నది అందరికి పెద్ద కోరిక ఉంటుంది. అయితే హార్వే హేండర్సన్ విల్లాక్స్ అనే వ్యక్తికి లాస్ ఏంజిల్స్ దగ్గర్లో పెద్ద రాంచ్ ఉండేది. విట్లీ అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి ప్లాట్స్ వేద్దామని ప్లాన్ చేసుకున్నాడు .
Also Read: ఉద్యోగులతో జగన్ అనవసరంగా పెట్టుకుంటున్నాడా?
ఆ ప్రాజెక్టుకు హార్వే వైఫ్ హాలీవుడ్ అనే పేరు పెట్టింది. అదే ఆ రోజు సెల్లింగ్ పాయింట్ అయింది. 1887లో హాలీవుడ్ అని ప్రారంభించి అక్కడి కొండమీద పెద్ద పెద్ద అక్షరాలతో హాలీవుడ్ అని రాశారు. ఇక విట్లీ ఆ ఏరియాను పెద్ద సుసంపన్నమైన ఏరియా అంటూ మార్కెటింగ్ చేయడం మొదలు పెట్టాడు. 1910లో దాన్ని మున్సిపాలిటీ చేశారు. దాంతో అక్కడ ఎక్కువగా సినిమా వాళ్ళు స్థలాలు కొనుక్కున్నారు. ఆ తర్వాత సినిమాలు తీయాలంటే హాలీవుడ్ ప్లేస్ బెస్ట్ అనే పేరు వచ్చింది.

థామస్ అల్వా ఎడిసన్.. 21 ఏళ్లకే దాదాపు 1000 పేటెంట్ రైట్స్ రిజిస్టర్ చేయించుకున్నాడు. టెలిగ్రామ్, టెలిఫోన్, మోషన్ పిక్చర్.. ఇలా ఎన్నో పేటెంట్ రైట్స్ ఆయన వద్ద ఉండేవి. మోషన్ పిక్చర్ తీయాలంటే ప్రతి సినిమాకు ఎడిసన్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. అయితే ఆ రోజుల్లో హాలీవుడ్ ఏరియాలో ఉన్నవారికి వర్తించేవి కావు. దీంతో ‘ఇఫ్ యూ వాంట్ టు మేక్ మూవీస్, గో టు హాలీవుడ్.. అదే బెస్ట్ ప్లేస్’ అనే నినాదాలు స్టార్ట్ అయ్యాయి. అలా హాలీవుడ్ సినిమాలకు బెస్ట్ ప్లేస్ అయింది.
ఆ తర్వాత మిస్టర్ ఖన్నా అనే ఆయన హాలీవుడ్ ని చూసి బాలీవుడ్ అని పేరు పెట్టాడు. అది చూసి టాలీవుడ్ అని, కోలీవుడ్ అని ఎవరికీ వాళ్ళు పేర్లు తగిలించుకున్నారు. అని పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడు.
Also Read: ఆ పనిచేసినందుకు టాలీవుడ్ హీరో అరెస్ట్..!
[…] […]
[…] Fever survey: దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఇటు తెలంగాణలో కూడా కేసులు భారీగానే పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ తో పాటు డెల్టా వేరియంట్ కేసులు కూడా భారీగానే పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో చాలామందికి జ్వరాలు, దగ్గు, జలుబు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే సెకండ్ వేవ్ సమయంలో ఉన్న పరిస్థితులు మరోసారి కనిపిస్తున్నాయి. దీంతో మొన్న కేబినెట్ మీటింగ్‌లో ప్రధానంగా కరోనా పరిస్థితుల మీదనే చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేసులు ఏ మేరకు నమోదవుతున్నాయి, పరిస్థితులు ఎలా ఉంటున్నాయనే దానిమీదనే చర్చించారు. […]
[…] […]