Couples Bathing In Holy River: కామా తురానాం న భయం న లజ్జ అన్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన వాడికి ఏదీ తెలియదని దానర్థం. అందుకే ఎక్కడ పడితే అక్కడ సరస శృంగార కేళి చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు. ఆ మధ్య ఓ జంట ద్విచక్ర వాహనంపై వెళుతూ ముద్దుల వర్షం కురిపించడంతో అప్పట్లో అది వైరల్ గా మారింది. ఇప్పుడు ఈ సంఘటన కూడా అందరిని ముక్కున వేలేసుకునేలా చేసింది. దీంతో సాటి వారు రెచ్చిపోయి వారిపై దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది.

Couples In Holy River
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రాముడిని దర్శించుకునేందుకు వెళ్లిన ఓ జంట సరయూ నదిలో స్నానం చేయడానికి దిగారు. పవిత్ర నదిలో స్నానం చేయడం అందరు చేస్తారు. కానీ వారు స్నానంతో పాటు శృంగారం చేయాలని భావించారు. ఎక్కడ చోటు దొరకనట్లు నదిలోనే భార్యను భర్త ముద్దుపెట్టుకోవడంతో పక్కనున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అతడిని బయటకు లాగి దాడికి పాల్పడ్డారు. దీంతో వారి ముద్దు వైరల్ గా మారింది. అందరు దాడి చేయడంతో ఓ వ్యక్తి మాత్రం వారిని బయటకు పంపించాడు.
Also Read: Virata Parvam Producers: సాయి పల్లవి పై విరుచుపడిన విరాటపర్వం నిర్మాతలు
అంతట బావే కానీ వంగ తోట కాడ మాత్రం కాదన్నట్లు శృంగారానికి కూడా కొన్ని హద్దులు ఉన్నాయి. పవిత్ర స్థలాల్లో ఆ పని చేయడం నిషేధమే. కానీ వారికి ఈ విషయం తెలియదా? నాగరికత పేరుతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ సాటి వారికి ఇబ్బందులు తీసుకురావడమే పనిగా పెట్టుకుంటున్నారు. దీంతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. పవిత్ర నదిలో అలాంటి కార్యమేమిటని అందరు ప్రశ్నిస్తున్నారు. శృంగారమే కావాలంటే పడక గదియే శ్రేయస్కరం. ప్రజా స్థలాల్లో ఇలాంటి పనులు ఏమిటనే సందేహాలు వస్తున్నాయి.

Coulples
సరసాలు శృతి మించితే అంతే. పబ్లిక్ స్థలాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకపోతే మనకే ప్రమాదం పొంచి ఉంటుంది. అదీ నదీ తీరం కావడంతో అందరు భక్తితో స్నానాలు చేస్తుంటే వారు మాత్రం అలా చేయడంపై ఆగ్రహాలు వ్యక్తం అవుతున్నాయి. పడుచు జంట అయితే పడక గదిలోనే చూసుకోవాలి కానీ ఇలా ప్రజల్లో ఉండగా ముద్దుల వరకు వెళ్లడం ఏమిటని అందరు మనిషికో మాట అన్నారు. మనిషికో దెబ్బ వేశారు. దీంతో ఆ యువకుడిని కొట్టొద్దని ఎంత మొత్తుకున్నా వినిపించుకోలేదు. చివరకు ఓ వ్యక్తి రావడంతో విడిచిపెట్టడం సంచలనం కలిగించింది. ఇదంతా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
अयोध्या: सरयू में स्नान के दौरान एक आदमी ने अपनी पत्नी को किस कर लिया. फिर आज के रामभक्तों ने क्या किया, देखें: pic.twitter.com/hG0Y4X3wvO
— Suneet Singh (@Suneet30singh) June 22, 2022