Puri Jagannath Liger: పూరి జగన్నాథ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చుపెట్టి విజయ్ దేవరకొండ తో ‘లైగర్’ అనే సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో తీసి ఆగస్టులో విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అతి ఘోరమైన డిజాస్టర్ ప్లాప్ గా నిలిచింది..సుమారు 90 కోట్ల రూపాయలకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్స్ కి అమ్మాడు పూరి జగన్నాథ్.

విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ వాళ్ళ ఓపెనింగ్స్ అయితే భారీగానే వచ్చాయి కానీ, రెండవ రోజు నుండి లాంగ్ రన్ మాత్రం కనీస స్థాయిలో కూడా రాబట్టలేకపోయింది..తెలుగు మరియు హిందీ భాషలకు కలిపి కేవలం 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా డిస్ట్రిబ్యూటర్స్ కి 60 కోట్ల రూపాయలకు పైగానే నష్టాలను కలిగించింది..ఇప్పుడు ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హైదరాబాద్ లో ఉన్న పూరి జగన్నాథ్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
వెంటనే మాకు నష్టపరిహారం చెల్లించాలి..లేకపోతే ఇక్కడే కూర్చొని ధర్నా చేస్తాము అంటూ పూరి జగన్నాథ్ పై ఒత్తిడి చేస్తూ బెదిరింపులు కూడా చేస్తున్నారు..ఇన్ని రోజులు సహనం తో ఓపికగా డిస్ట్రిబ్యూటర్స్ అందరకి సమాధానం చెప్పుకుంటూ వచ్చిన పూరి జగన్నాథ్, ఈరోజు పూర్తి స్థాయిలో సహనం కోల్పోయినట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి..’ఇస్తాను అని చెప్పను కదా..ఇలా ఊరికే చిరాకు రప్పిస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వాలని అనిపించట్లేదు’ అంటూ డిస్ట్రిబ్యూటర్స్ కి ఫోన్ కాల్ లో చెప్పాడట పూరి జగన్నాథ్..ప్రస్తుతం ఈ వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది.
గతం లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఆచార్య సినిమాకి కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి..కానీ చిరంజీవి మరియు కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి అందాల్సిన నష్టపరిహారం అందించేసారు..ఇప్పుడు పూరి జగన్నాథ్ కూడా అలాగే చేస్తాడా లేదా అనేది ప్రస్నార్ధకం..పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రం కూడా విజయ్ దేవరకొండ తోనే తెరకెక్కిస్తున్నాడు..లైగర్ విడుదలకి ముందే ‘జన గణ మన’ అనే సినిమాని ప్రారంభించాడు..ఒక షెడ్యూల్ చేసి చిన్న టీజర్ కూడా వదిలాడు..అయితే లైగర్ ఫ్లాప్ అవ్వడం తో ఆ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది..రాబొయ్యే రోజుల్లో ప్రారంభం అవుతుందా లేదా అనేది చూడాలి.