Akhanda 2 Teaser Review: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు… ఇక ఇండస్ట్రీలో ఇప్పుడున్న వాళ్ళలో కొంత మంది స్టార్ హీరోలుగా మారిపోతున్నారు. ఒకప్పుడు టాప్ హీరోలుగా ఉన్న చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి నటులు సీనియర్ హీరోలుగా మారిపోవడంతో వాళ్ళ ప్లేస్ లో టాప్ హీరోలు కొంతమంది మంచి గుర్తింపును సంపాదించుకున్నారు… ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిధి పెరిగిపోయింది. ఎవరు ఏ సినిమా చేసిన ఆ మూవీస్ టాప్ రేంజ్ లోనే ఉంటున్నాయి. దానికి తగ్గట్టుగానే కలెక్షన్స్ ను కొల్లగొడుతున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబు లాంటి సీనియర్ హీరోలతో సైతం హీరోలతో పోటీ పడుతున్నాడు అంటే మామూలు విషయం కాదు… ఇక బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు ఇండస్ట్రీలో చాలా గొప్ప గుర్తింపునైతే సంపాదించుకున్నాయి. సింహా సినిమాతో స్టార్ట్ అయిన వీళ్ళ కాంబినేషన్ లెజెండ్, అఖండ సినిమాల వరకు కొనసాగింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా చేస్తున్న ‘అఖండ 2’ సినిమా కూడా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటుందంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ డేట్ రెండు సార్లు పోస్ట్ పోన్ అయింది. కానీ ఇప్పుడు నవంబర్ నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే ఈరోజు ఈ సినిమా నుంచి ఒక టీజర్ బయటకు వచ్చింది.
Also Read: ‘ఓజీ’ లో అర్జున్ దాస్ క్యారక్టర్ ని మిస్ చేసుకున్న యంగ్ హీరో అతనేనా..?
ఈ టీజర్ ను చూసిన ప్రతి ఒక్కరు బాలయ్య బాబు ఈ సిన్స్ లో తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు అనే ఒక కాన్ఫిడెన్స్ తో ఉన్నారు… ఇప్పటికే ఈ ఇయర్ లో భారీ విజయాన్ని సాధించిన స్టార్ హీరో ఎవరు లేరనే చెప్పాలి. జనవరి నెలలో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయాన్ని దక్కించుకుంది.
300 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక పవన్ కళ్యాణ్ చేసిన ఓజీ సినిమా 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను సాధించింది. ఇక ఇప్పుడు బాలయ్య బాబు ‘అఖండ 2’ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఔట్ అండ్ ఔట్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ఈ సినిమా 400 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొడుతుందనే వార్తలు వస్తున్నాయి.
ఇదే కనక జరిగితే ఈ ఇయర్ అన్ని సినిమాలను మించి ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… నిజానికి బోయపాటి – బాలయ్య కి మంచి మార్కెట్ అయితే క్రియేట్ అయింది. కాబట్టి వీళ్ళ సినిమాలకు మించి ‘అఖండ 2’మూవీ ఉండబోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…