Mahesh Babu Rajamouli Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) ఎప్పుడైతే ఆయన బాహుబలి సినిమా చేశాడో అప్పటినుంచి పాన్ ఇండియా దర్శకుడిగా మారిపోయాడు. ఇక ఆ తర్వాత చేసిన ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో ఆస్కార్ రేంజ్ కి వెళ్లి హాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు. మొత్తానికైతే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం రాజమౌళి విపరీతంగా కష్టపడుతున్నాడు. ఇక ఇప్పటికి రెండు షెడ్యూల్స్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన ఆయన మూడో షెడ్యూల్ కోసం తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి నుంచి వస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అటెన్షన్ అయితే క్రియేట్ అవుతోంది. మరి ఈ సినిమా మీద కూడా అలాంటి ఒక బజ్ అయితే ఉంది. అయితే ఈ సినిమా రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ సినిమాలో మహేష్ బాబు చేసే యాక్షన్ అడ్వెంచర్స్ చాలా హైలెట్ గా ఉంటాయని ఒక ఫైట్ మాత్రం ఇప్పటివరకు ఏ సినిమాలో చూడనటువంటి రేంజ్ లో కొత్తగా ఉండబోతుందంటూ ఆయన చెప్పాడు. ఇక దాంతో మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు… ఇక రాజమౌళి తన స్టైల్ లోనే ఈ సినిమాని చెక్కుతూ వస్తున్నాడు. మరి 2027లో అయిన ఈ సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ లో మార్పులు చేశారా..?
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయని రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని తొందర్లోనే రిలీజ్ చేయాలనే ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది…రాజమౌళి ఏం చేసినా ఒక స్ట్రాటజీని ఫాలో అవుతూ చేస్తూ ఉంటాడు.
కాబట్టి ఆయన సినిమాలకు భారీ బజ్ అయితే ఉంటుంది. ఇక దాంతో పాటుగా ఆయన హీరోలతో పాటు ఇచ్చే ఇంటర్వ్యూలు అలాగే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనే విధానం అన్ని కలిపి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.
Also Read: భయపెడుతున్నారు..కానీ నన్ను థియేటర్ కి రాకుండా ఆపలేరు – విజయ్ దేవరకొండ
ఇక మొట్ట మొదటిసారి ఒక తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న ఘనత కూడా తనకే దక్కుతోంది. మరి అతని బాటలోనే మిగతా దర్శకులందరు కూడా నడిచి వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు…