Mayasabha Trailer Review: ప్రస్థానం సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు దేవకట్ట…ఆయన చేసిన సినిమాల్లో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఆయన ‘మయసభ’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే ఆగస్టు 7వ తేదీన సోనీ లీవ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అయింది. ఈ సిరీస్ కంటెంట్ ను ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక ట్రైలర్ ని రిలీజ్ చేశారు…అయితే ఈ ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన ఫ్రెండ్షిప్ పొలిటిషియన్స్ గా మారిన తర్వాత వాళ్ళ మధ్య ఎలాంటి వైరుధ్యాలకు దారి తీసింది. రాజకీయం వల్ల మనుషుల మధ్య ఎలాంటి విభేదాలు వస్తాయి? అనేది మన కన్నులకు కట్టినట్టుగా ఈ సినిమాలో చూపించాబోతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సిరీస్ ను ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు చూద్దాం అని చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య జరిగిన స్టోరీగా తెలుస్తోంది. మరి ఇందులో ఎవరు ఎవరిపైన విజయం సాధించారు.? ఎవరు ఎలాంటి ఎత్తుగడలు వేశారు? రాజకీయంగా అధికారాన్ని దక్కించుకోవడానికి ఎవరు ఎలాంటి ప్రణాళికలను రూపొందించారు అనేది మయసభ సిరీస్ లో ప్రధానంగా చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: చంద్రబాబు సింగపూర్ టూర్ పై పెద్దిరెడ్డి ‘పెద్ద’ కుట్ర?
కొందరు నాయకులు మంచి చేయడానికి ఎలాంటి ఎత్తుగడలు వేసి దాన్ని రాజకీయం చేస్తారు అనే కోణంలో కొన్ని సీన్లు ఉంటే, పేదలకు న్యాయం చేయడానికి నిజమైన లీడర్ ఎలాంటి అడుగులు వేస్తూ ముందుకు సాగుతాడు అనే సన్నివేశాలు కూడా ఇందులో చిత్రీకరించెబుతున్నట్టు గా తెలుస్తోంది…
రియల్ ఇన్సిడెన్స్ తో తెరకెక్కుతున్న ఈ సిరీస్ ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది. ప్రేక్షకులందరిని వేరొక లోకంలోకి తీసుకెళ్తుందా? అనేది తెలియాల్సి ఉంది.ఇక ఈ సిరీస్ ట్రైలర్ కట్ ఎవరు చేశారో కానీ చాలా అద్భుతంగా చేశారు.
ముఖ్యంగా ఆ రెండు క్యారెక్టర్ లను ఎలివేట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇన్వాల్వ్ చేస్తూ రాసుకున్న సన్నివేశాలు ఈ సిరీస్ లో హైలెట్ గా నిలువబోతున్నట్లుగా తెలుస్తున్నాయి… సెంట్రల్ పార్టీకి సైతం పోటీని ఇస్తూ ఆది పినిశెట్టి, చైతన్య రావు ఇద్దరు ఎలాంటి ఎత్తుగడలు వేశారు. ఫైనల్ గా వాళ్ళు సీఎం లుగా ఎలా ఎదిగారు అనేదే ఈ సిరీస్ ఫైనల్ స్టోరీ గా తెలుస్తోంది…