Double iSmart: తెలుగు సినిమా ఇండస్ట్రీ దశ దిశ మార్చిన దర్శకులలో పూరి జగన్నాథ్ ఒకరు. ప్రస్తుతం ఈయన డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాని చేస్తున్నాడు. అయితే రామ్ హీరోగా ఇంతకుముందే ఆయన ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాతో రామ్ కి ఒక్కసారిగా మాస్ ఫాలోయింగ్ అయితే వచ్చింది. కానీ ఆ తర్వాత ఆయన చేసిన రెడ్, స్కంద సినిమాలు ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగా లేకపోవడంతో ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
మరోసారి రామ్ పూరి జగన్నాథ్ ను నమ్ముకొని డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే చాలా రోజుల నుంచి ఈ సినిమా ఆగిపోయింది అంటూ చాలా వార్తలైతే వచ్చాయి. కానీ మొత్తానికైతే ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది అంటూ రీసెంట్ గా దర్శకుడు పూరి జగన్నాథ్ ఆ విషయం పైన స్పందించాడు. ఇక ఈ ఆదివారం 10:03 గంటలకు ‘డబుల్ ఇస్మార్ట్ ‘ కు సంబంధించిన ఒక అప్డేట్ ను అయితే వదలబోతున్నట్టుగా సినిమా యూనిట్ ఒక అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చింది.
ఇక ఈ సినిమా నుంచి రామ్ కొత్త టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఇదిలా ఉంటే రామ్ ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అటు యాక్షన్ ఎపిసోడ్ చేసుకుంటూనే,ఇటు కామెడీ ని కూడా పండించిన రామ్ ఈ సినిమాలో అంతకుమించి నటించి మెప్పించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్ తో అటు పూరి అభిమానులు, ఇటు రామ్ అభిమానులు పండగ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తానికైతే ఇస్మార్ట్ శంకర్ రీతిలోనే ఈ సినిమా కూడా భారీ సక్సెస్ ని సాధించి రామ్ కి మాస్ ఇమేజ్ ని కట్టబెట్టడంలో హెల్ప్ అవ్వాలని చాలామంది సినీ ప్రేమికుల సైతం కోరుకుంటున్నారు…