Puri Jagannadh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది పూరి జగన్నాథ్ అనే చెప్పాలి. ఒకప్పుడు ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా గొప్పగా పరిచయం చేశాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను మించిన దర్శకుడు మరొకరు ఉండరు అనేంతలా గొప్ప పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న ఆయన ఇక మీదట చేయబోయే సినిమాలతో కూడా మరోసారి పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొద్ది సంవత్సరాల నుంచి ఆయన ఏ మాత్రం సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఆయన ఒక పెద్ద సక్సెస్ ను అందుకోవాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం ఆయన విజయ్ సేతుపతి (Vijay Sethupathi) ని మెయిన్ లీడ్ గా పెట్టి ఒక సినిమా అయితే ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ మూవీకి బెగ్గర్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. టైటిల్ చాలా డిఫరెంట్ గా పెట్టడం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఇక ఈ సినిమాలో టబ్ తో పాటు నివేదిత థామస్ కూడా నటించబోతుంది అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
మరి మంచి నటులతో సినిమా చేస్తూ ముందుకు సాగాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయనకంటు ఎలాంటి ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు పాన్ ఇండియాలో ఏమాత్రం సక్సెస్ లను సాధించలేకపోతున్నాయి. ఇక రామ్ తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) సినిమా తర్వాత ఆయనకు సరైన సక్సెస్ అయితే పడడం లేదు. మరి ఇప్పుడు చేయబోతున్న సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకొని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం కూడా దక్కవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సినిమాని చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన సూపర్ సక్సెస్ ను సాధిస్తే పూరి జగన్నాథ్ పూర్వ వైభవాన్ని సంతరించుకన్నాడు అవుతాడు. ఇక మరోసారి స్టార్ హీరోలతో సినిమాలు చేసి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవకాశం అయితే దక్కుతుంది.