https://oktelugu.com/

Puri Jagannath : చేసే ప్రతి పనిని ఎంజాయ్ చేయండి అంటున్న పూరి జగన్నాధ్…

ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ కి మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వెలుగొందిన ఈయన ఇప్పుడు కొంతవరకు డౌన్ ఫాల్ అయినప్పటికి ఆయన లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో లేరు అంటూ ఇప్పటికీ ఆయన గురించి చెబుతూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా మరోసారి ఆయన భారీ సక్సెస్ ని అందుకొని బౌన్స్ బ్యాక్ అయితే చూడాలని చాలామంది ఎదురుచూస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : November 27, 2024 / 11:21 PM IST

    Puri Jagannath

    Follow us on

    Puri Jagannath : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్… ప్రస్తుతం ఆయన వరుసగా ఫ్లాప్ సినిమాలను తీస్తున్నప్పటికి ఎప్పటికప్పుడు అతని అభిమానులు మాత్రం పూరి జగన్నాధ్ బౌన్స్ బ్యాక్ అవుతాడు అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆయన సినిమాల విషయాలు ఎలా ఉన్నా కూడా పూరి ముసింగ్స్ అనే పోడ్ కాస్ట్ ద్వారా ఆయన ప్రతిరోజు ఏదో ఒక విషయాన్ని తన అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో కొన్ని మంచి మాటలను చెబుతూ ఉంటారు. ఇక అందులో భాగంగానే ఈరోజు స్లో లైఫ్ అనే ఒక విషయాన్ని చాలా క్లియర్ కట్ గా తెలియజేశారు. ఇక అందులో ఆయన చెప్పిన మాటలను బట్టి చూస్తే ప్రతి ఒక వ్యక్తి ఫాస్ట్ ఫార్వర్డ్ గా తన లైఫ్ ను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఒక మెకానికల్ లైఫ్ ని గడుపుతున్నారు తప్ప చేసే ప్రతి పనిని ఎవ్వరూ ఫుల్ ఫిల్ గా చేయడం లేదు. అలాగే ఆస్వాదించడం లేదు అంటూ కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే తెలియజేశాడు. ఇక ఏది ఏమైనా కూడా పూరి జగన్నాధ్ లాంటి దర్శకుడు చెప్పే మాటలను విని ఆచరించడానికి చాలామంది ఆయన అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఆయన లాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేది ఎంత వాస్తవమో ఆయన లాంటి మాటలను జనాలకు చెప్పే వ్యక్తి కూడా లేరనేది నమ్మలేని నిజం. ఇక మనం రోజు చేసే లైఫ్ మనకి రొటీన్ గా అనిపించినప్పటికి పొద్దున బెడ్ మీద నుంచి లేచి రెండు నిమిషాల్లో మొహం కడుక్కొని, మూడు నిమిషాల్లో స్నానం చేసి ఆఫీస్ కి బయలుదేరడం కాదు పొద్దున్నే లేచి ఒక హాఫ్ ఆన్ అవర్ పాటు యోగా చేసి అందులో ఉన్న ఆనందాన్ని పొందాలి…

    అలాగే వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ నడవాలి. ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి ఇక ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఏదో బడన్ గా ఫీల్ అవ్వకుండా సైకిల్ తొక్కడం నలుగురు మనుషులతో మాట్లాడడం లాంటివి చేస్తూ ఆ ఫీల్ ను ఆస్వాదిస్తే మన క్రియేటివిటీ లెవెల్స్ కూడా పెరుగుతాయి. అలాగే ఎక్కువ శాతం అవుట్ డోర్ లో గడపడానికి ప్రయత్నం చేయాలి.

    దీనివల్ల మానసిక ఆనందాన్ని పొందడమే కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి తనను తాను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇవన్నీ ఆచరించడానికి డబ్బున్న వాళ్లకు చాలా ఈజీ..కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది అని చాలామంది అనుకుంటారు.

    రెగ్యులర్ గా లైఫ్ ను లీడ్ చేసే మిడిల్ క్లాస్ వ్యక్తులు కూడా దీనిని పాటించవచ్చు. ఎలాగంటే వాళ్ళు రోజు ఏ టైమ్ కి అయితే నిద్ర లేస్తారో దానికి ఒక గంట ముందు లేచి ఇవన్నీ పనులు చేయొచ్చు అంటూ ఆయన ఒక మంచి ఫోర్డ్ కాస్ట్ అయితే తన అభిమానులకు తెలియజేశారు…