Godfather: మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు పండగే. ఆయన ఏ సినిమా చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. బ్రహ్మరథం పడతారు. ఆయనకు ప్రేక్షకుల్లో క్రేజీ అలాంటిది. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. తన నటనతో పాటు డాన్సులతో ఉర్రూతలూగించే చిరంజీవి తన తదుపరి చిత్రం ప్రకటించారు. తమిళంలో విజయవంతమైన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంకా ఈ సినిమాలో భారీ ట్విస్ట్ లు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పాత్ర చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి భారీగానే రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్లు సమాచారం. ఆయన పాత్ర కేవలం ఇరవై నిమిషాలే ఉంటుంది. దీని కోసం అంత బడ్జెట్ కేటాయించినట్లు సమాచారం. ఇంకా విశేషమేమిటంటే ఇందులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కూడా ఓ పాత్రలో కనిపించనున్నారట. దీంతో దీనిపై అభిమానులకు ఒకటే ఉత్కంఠ నెలకొంది.
Also Read: KGF 2′ Movie Review:`కేజీఎఫ్ 2′ రివ్యూ
తమ అభిమాన నటులు, దర్శకులు ఉండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికి గాడ్ ఫాదర్ అనే నామకరణం చేశారు. ఇక సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి స్టామినాకు అనుగుణంగానే చిత్ర నిర్మాణం ఉంటున్నట్లు కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్ రాకతో ఈ సినిమా ప్యాన్ ఇండియా మూవీగా మారిపోయింది. ఇటీవల చిరంజీవి, సల్మాన్ ఖాన్ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.
పూరీ జగన్నాథ్ నటిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ ద్వారా తెలియజేశారు. దీంతో ఈ సినిమాపై అందరికి అంచనాలు పెరుగుతున్నాయి. పూరీ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. చిత్రం ప్రారంభంలో పాత్రలను పరిచయం చేసే పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. మొత్తానికి చిరంజీవి సినిమా ముందే సంచలనాలు సృష్టిస్తుండటంతో ఇక విడుదలైతే ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో అని అందరు చర్చించుకుంటున్నారు.

సినిమాలో నయనతార, సత్యదేవ్, హరీష్ఉత్తమన్, జయప్రకాశ్, వంశీకృష్ణ తదితరులు నటిస్తున్నారు. మెగాస్టార్ సినిమా ఇంకా ఎన్ని ట్విస్ట్ లు ఇస్తుందో తెలియడం లేదు. రాజకీయాలకు దూరమయ్యాక మెగాస్టార్ చిరంజీవి సినిమాలపైనే దృష్టి సారించడంతో వేగం పెంచారు.సినిమాల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో ఆయన అభిమానులకు కనువిందు చేయనున్నారు.
Also Read:KGF2: ఇంత అద్భుతంగా కేజీఎఫ్2 ఫైనల్ కట్ చేసిన ఎడిటర్ ఈ 19 ఏళ్ల కుర్రాడని తెలుసా?