Ambedkar Jayanti 2022: అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్. ఏ దేశంలో లేని కులం, మతం వ్యవస్థలు సమాజాన్ని అతలాకుతలం చేశాయి. దీంతో విసిగిపోయిన ఆయన తన జీవితమంతా వ్యవస్థలో మార్పు రావాలని ఆకాంక్షించారు. సమాజంలో ఉన్న కుళ్లును కడిగేయాలని తాపత్రయ పడ్డారు. ఈనేపథ్యంలో ఆయన 131వ జయంతిని ఇవాళ నిర్వహించుకుంటున్నారు. ఏప్రిల్ 14, 1891లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అంబవాడే లో రాంజీ మలోజీ సాక్వాల్, భీమా బాయ్ లకు జన్మించారు.

రాజ్యాంగ రచనకు అంబేద్కర్ ఎంతో కృషి చేశారు. అన్ని దేశాల రాజ్యాంగాలను చదివి అందులోని అంశాలను ఆకళింపు చేసుకుని పటిష్ట రాజ్యాంగాన్ని రచించారు. మన దేశ రాజ్యాంగంపై అన్ని దేశాలు ఆసక్తి చూపించాయి. కుల, మత వ్యవస్థలకు సంబంధం లేకుండా చేయడమే ఆయన ఎంచుకున్న మార్గం. అందుకు కుల, మతాలకు, అంటరానితనం ఉండకకూడదనే ఉద్దేశంతో ఆయన రచించిన రాజ్యాంగం విలువ ఎంతో ఖ్యాతి గడించింది. ప్రపంచ మేధావుల ప్రశంసలు అందుకుంది.
Also Read: KGF 2′ Movie Review:`కేజీఎఫ్ 2′ రివ్యూ
ప్రజాస్వామ్యం, అంటరానితనం, కుల నిర్మూలన, మతమార్పిడి, బౌద్ధమతం, హిందూ మతంలోని చిక్కుముడులు, ఆర్థిక సంస్కరణలు-దళితులు, భారతదేశ చరిత్ర తదితర అంశాలపై అంబేద్కర్ రచనలు చేశారు. కుల వ్యవస్థ నిర్మూలనకు తన బతుకంతా పోరాటం సాగించారు. కులం అనే కుళ్లును కడిగేయాలని ఆయన చేయని ప్రయత్నాలు లేవు. కానీ దేశంలో వేళ్లూనుకున్న కులం చిచ్చు ఇప్పటికి కూడా కొనసాగుతుండటం గమనార్హం.
ప్రపంచంలోనే అత్యంత ఆరుగురు మేధావుల్లో అంబేద్కర్ ఒకరు కావడం తెలిసిందే. తెలుగులో అంబేద్కర్ గురించి రాసింది మాత్రం గుర్రం జాషువే. 1947లో వెలువరించిన కావ్యం గబ్బిలంలో అంబేద్కరుండు సహోదరుండు అనే పద్యం ద్వారా అంబేద్కర్ గురించి రాశారు. దీంతో తెలగు సాహిత్యంలో అంబేద్కర్ స్తానం సంపాదించుకోవడం విశేషం.

పాఠశాలలో కూడా ఒకమూలకు ఉండి చదువుకోవడంతో అంబేద్కర్ లో అంటరానితనంపై ఆవేదన పెరిగింది. మంచినీళ్లు తాగాలంటే అటెండర్ ఇవ్వాల్సిందే. బరోడా మహారాజు శాయాజీ రావ్ గైక్వాడ్ ఇచ్చే రూ.25 ల వేతనంతో 1912లో బీఏ చదివారు. 1913లో రాజుగారి ఆర్థిక సాయంతో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, 1916లో పీహెచ్ డీ చేసి 1917లో మహారాజు సంస్థానంలోనే మిలిటరీ కార్యదర్శిగా ఉద్యోగం సంపాదించారు.
మహాత్మాగాంధీకి అంబేద్కర్ కు మాత్రం విరుద్ధ భావాలు ఉండేవి. దీంతో పలుమార్లు ఇద్దరి మధ్య సఖ్యత ఉండేది కాదు. గాంధీ నిర్ణయాలను అంబేద్కర్ ఒప్పుకునే వారు కాదు. పలు తీర్మానాలను అంబేద్కర్ ఒప్పుకునే వారు కాదు. దేశవ్యాప్తంగా వెనుకబడిన దళితులకు రిజర్వేషన్లు ఉండాలని అంబేద్కర్ పోరాడినా గాంధీ మాత్రం వద్దని అడ్డుచెప్పేవారు.దీంతో పలు దఫాలు వీరి మధ్య దూరం పెరిగేది. ఇప్పుడున్న రిజర్వేషన్లు కూడా ఆయన సూచించినవే కావడం గమనార్హం.
Also Read:KGF2: ఇంత అద్భుతంగా కేజీఎఫ్2 ఫైనల్ కట్ చేసిన ఎడిటర్ ఈ 19 ఏళ్ల కుర్రాడని తెలుసా?